‘చిత్రలహరి’ టీజర్.. ఈ సారి మెగా మేనల్లుడు హిట్టుకొట్టేలా ఉన్నాడు!

Recommended Video

Sai Dharam Tej Seems To Score A Big Hit With Chitralahari Movie | Filmibeat Telugu

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా వదిలిన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. టీజర్ చూసిన వారంతా ఈ సారి మెగా మేనల్లుడు హిట్టు కొట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రలహరి

చిత్రలహరి

‘‘చిత్ర లహరి.. అప్పట్లో దూరదర్శన్‌లో ప్రతి శుక్రవారం వచ్చే ఓ కార్యక్రమం. ఈ ‘చిత్రలహరి' 2019లో శుక్రవారం రిలీజ్ కాబోయే ఓ సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు'' అంటూ సుకుమార్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది.

మొదటి పాత్ర..

మొదటి పాత్ర..

‘‘మగాళ్లంతా సేమ్.. మనల్ని రీచ్ అయ్యే వరకు ఒకలా ఉంటారు. రీచ్ అయ్యాక అదరూ ఒకేలా ఉంటారు.'' అంటూ మొదటి పాత్ర అంటూ నివేదా పేతురాజ్ క్యారెక్టర్ పరిచయం చేశారు.

రెండో పాత్ర..

రెండో పాత్ర..

‘‘నా గురించి నేను చెప్పాలంటే... నాకు కొంత సమయం కావాలి. అందరితో డిస్క్రస్ చేయాలి.'' అంటూ రెండో పాత్ర క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ పరిచయమైంది.

మూడో పాత్ర

మూడో పాత్ర

‘‘బ్రాండీ షాపువాడు 5 చిల్లర లేదని హల్దీరామ్ ప్యాకెట్ అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే... నిన్న నువ్వు ఇచ్చిందే అంటూ మరో ప్యాకెట్ తీసి 10 ఇవ్వు'' అంటూ అడిగే పాత్రలో కమెడియన్ సునీల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.

అసలు పాత్ర

అసలు పాత్ర

‘‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడు వస్తుందో..'' అని ఎదురు చూసే పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించారు. నీకు ఒక మంచి రోజు వస్తుందే అని అంటే... ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మను, ఇంట్లో ఖాళీగా ఉంటాను అనే రకం. ఇలా నాలుగు భిన్నమైన పాత్రలతో చిత్రలహరి టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి

కిషోర్ తిరుమల సినిమా అంటే ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌ ప్రెజంట్ చేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X