ఈసారి మెగా మేనల్లుడు హిట్టు కొడతాడా?.. ‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
Recommended Video

మెగా ఫ్యామిలీ స్టార్, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ప్లాపుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం రిలీజ్ కాబోయే 'చిత్రలహరి'పై ఈ సుప్రీం హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సారి సాయి ధరమ్ తేజ్ గట్టెక్కుతాడనే నమ్మకం అందరిలోనూ నెలకొని ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న 'చిత్రలహరి'లో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

అన్ని ఏరియాల్లోనూ రీజనబుల్ రేట్లకే...
ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లోనూ రీజనబుల్ రేట్లకే అమ్మడంతో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు మినిమమ్ గ్యారంటీ ప్రాఫిట్లతో బయటపడతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. వరల్డ్ వైడ్ అన్ని ఏరియాలకు కలిపి రూ. 13 కోట్లకు రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది.

ఏరియా వైజ్
నైజాం రూ. 3 కోట్లు, సీడెడ్ రూ. 1.80 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.32 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 96 లక్షలు, వెస్ట్ గోదావరి 84 లక్షలు, కృష్ణ రూ. 90 లక్షలు, గుంటూరు రూ. 1.10 కోట్లు, నెల్లూరు రూ. 48 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 1 కోటి, ఓవర్సీస్ రూ. 1.50 కోట్లు రైట్స్ అమ్మినట్లు సమాచారం.

క్లీన్ మూవీగా సర్టిఫికెట్
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకన్న ఈ చిత్రం క్లీన్ మూవీగా ‘యు' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై భారీ హైప్ రావడంతో రిలీజ్ కూడా అదే స్థాయిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల కానుంది.

చిత్రలహరి
కిషోర్ తిరుమల సినిమా అంటేనే వినోదం ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో చిత్రలహరి తెరకెక్కిందని చిత్ర బృందం చెబుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరింత ప్లస్ అవ్వనుంది. సాయిధరమ్‌తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.


Click it and Unblock the Notifications











