అక్షరహాసన్ కిడ్నాప్.. ఆసక్తి రేపుతున్న మిస్టర్ కెకె ట్రైలర్

విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే హీరో చియాన్ విక్రమ్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సహా సౌత్ ఇండియాలోనే విలక్షణ పాత్రలు పోషించే నటుడిగా విక్రమ్ మంచి గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన చేసిన 'అపరిచితుడు' సినిమా ఎప్పటికీ మరచిపోలేరు ఆడియన్స్. అయితే విక్రమ్‌ హీరోగా రాబోతున్న మరో విభిన్న కథాంశమే 'మిస్టర్ కెకె'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

కాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మిస్టర్ కెకె ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు, తమిళ రెండు భాషల్లో ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ట్రైలర్ లో విక్రమ్, కమల్ హాసన్ కూతురు అక్షరహాసన్ లపై షూట్ చేసిన సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి. గ‌ర్భ‌వ‌తి అయిన అక్షరహాసన్ ని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత ఆమె భర్తను బ్లాక్ మెయిల్ చేయడం, విక్రమ్ క్యారెక్టరైజేషన్ ఈ ట్రైలర్‌లో ఆసక్తికర అంశాలు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కెకె పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Chiyaan Vikram’s Mister KK Trailer Out

కడరం కొండెన్ అనే పేరుతో తమిళంలో, మిస్టర్ కెకె పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జులై నెలలో ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X