Dhruva Nakshatram: ఓవైపు మాస్, మరోవైపు రొమాన్స్.. ఇదంతా ఓకే కానీ విక్రమ్ వాయిసే తేడా కొట్టేస్తుంది భయ్యా!
Dhruva Nakshatram Trailer: విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ.. సినిమా సినిమాకు తమ మార్కును చూపిస్తూ ముందుకెళ్తున్న స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ హీరోగా చేసిన ప్రతీ సినిమా ఓ అద్భుతమే. డైరెక్ట్ గా చూసేందుకు చాలా హ్యాండ్ సమ్ గా ఉండే ఈ హీరో డీగ్లామరస్ పాత్రల్లో కనిపించేందుకు.. సినిమాల్లోని క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రల్లో కనిపిస్తూ అందరినీ అలరించే విక్రమ్.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ముఖ్యంగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం: చాప్టర్ 1 యుద్ధకాండం పేరుతో ఈ సినిమా రాబోతుంది. తమిళంలో ధృవ నచ్చతిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ధృవ నక్షత్రంగా గా అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఒక్క తెలుగులోకి మాత్రమే కాకుండా మరికొన్ని భాషల్లోకి కూడా ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ప్రకటించిన చిత్రబృందం తాజాగా మరో లేటెస్ట్ అప్ డేట్ ను బయటకు వదిలారు. దృవ నక్షత్రం సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.

తమిళంలో రెండు వారాల క్రితమే విడుదల చేసినప్పటికీ.. తెలుగులో మాత్రం ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా అనిపిస్తోంది. విక్రమ్ లుక్ ఎప్పటిలాగే అదిరిపోయింది. ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్జీ టీంలో ఉన్న ఓ సీనియర్ అధికారి తాను ఎదర్కున్న సవాళ్లను వివరిస్తూ కనిపిస్తాడు. ఈక్రమంలోనే టెర్రరిస్టులతో పోరాడేందుకు ఓ టీంను తయారు చేయగా.. విక్రమ్ జాన్ గా స్పెషల్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తాడు. విలన్స్ తో ఫైట్ చేయడాన్ని ఈ ప్రోమోలో మనం చూడవచ్చు. ఓవైపు ఫైట్ చేస్తూనే మరోవైపు విక్రమ్ రొమాన్స్ చేయడం అదిరిపోయింది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ వాయిస్ మారిపోయింది. గతంలో విక్రమ్ వాయిస్ ఒకలా ఉండగా.. ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. గతంలో విక్రమ్ సినిమాకలుక డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గాత్రదానం చేసేవారు. అపరిచితుడు సినిమా నుంచి ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన విక్రమ్ ప్రతీ సినిమాకు ఆయనే డబ్బింగ్ చెప్పారు. అయితే ఇటీవలే ఆయన చనిపోవడంతో ఈ సినిమాకు కొత్త వాళ్లతో డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వచ్చింది.
గతంలో వచ్చిన అన్ని సినిమాల్లో విక్రమ్ వాయిస్ ను అచ్చం ఆయనలాగే దింపేయగా.. ఇప్పుడు మాత్రం ఆయన వాయిస్ లోని తేడా చాలా చక్కగా కనిపిస్తోంది. ఇది విక్రమ్ అభిమానులు చాలా సులువుగా గుర్తు పట్టేస్తారు. మీరూ ఓసారి ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థం అయిపోతుంది. ధృవ నక్షత్రం సినిమాకు ప్రీతి శ్రీవిజయన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రీతూ వర్మ, ఆర్ పార్తీబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్ దర్శిని, మున్నాసైమన్, వంశీకృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











