జానీ మాస్టర్ దగ్గరకి వెళ్లమని నేనే చెప్పా..: అనీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
Jani Master Case: సినిమా ఇండస్ట్రీని జానీ మాస్టర్ వివాదం షేక్ చేసింది. తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో భాగంగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ వివాదంపై మహిళా కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ స్పందించారు. ప్రెస్ మీట్ లో పలు విషయాలను వెల్లడించింది. ఇంతకీ ఏం మాట్లాడిందంటే..?
జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రేష్టి వర్మ సంచలన ఆరోపణలు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాననీ, పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని, ఆ విషయాన్ని బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ భయపెట్టాడని ఆరోపించింది. ఈ మేరకు జానీ మాస్టర్‌పై సెప్టెంబర్ 15వ తేదీన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది.దీంతో జానీ మాస్టర్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం, ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయను ఉత్తమ కొరియోగ్రఫర్ గా వచ్చిన జాతీయ అవార్డును కమిటీ రద్దు చేసింది.

ఇలా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జానీ వివాదంపై మహిళా కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించింది. జానీ మాస్టర్ ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చారని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం తనని ఎంతో షాక్‌కు గురి చేసిందని ఎమోషనల్ అయ్యారు అనీ మాస్టర్.ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానన్నారు. తాను జానీ మాస్టర్ తో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాననీ, కానీ నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదనీ, ఒకవేళ బాధితురాలికి నిజంగా అన్యాయం జరిగితే.. మాత్రం ఆమెకు నా మద్దతు ఉంటుందని అన్నారు అనీ మాస్టర్.
జాతీయ అవార్డు రద్దు కావడంపై అనీ మాస్టర్ మాట్లాడుతూ.. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారనీ, నోటి దగ్గరి దాన్ని కాలితో తన్నేశారనీ. ఇది కరెక్ట్ కాదనీ, కష్టపడి పైకి వచ్చిన మనిషిని ఇలా సర్వనాశనం చేయడం తప్పు అని బాధపడ్డారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న అమ్మాయి వేధింపులకు గురైన ఇన్ని రోజులు ఎలా పని చేయదు కదా అని ప్రశ్నించారు.
ఈ వివాదంలో నిజానిజాలు తెలిసే వరకు ఏ విషయాన్ని తాను నమ్మననీ, దాదాపు ఆరు నెలల క్రితం బాధితురాలే స్వయంగా జానీ మాస్టర్ గొప్ప అని పలు సందర్భాల్లో చెప్పింది. మాస్టర్‌ని అంత గొప్పగా పొగిడిన ఆ అమ్మాయి.. ఇప్పడేందుకు ఇలా కేసు పెట్టిందేంటీ ? అని ప్రశ్నించారు. ఈ వివాదంలో తనకు పలు సందేహాలు వస్తున్నాయనీ, ఇప్పుడు తాను ఏదైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటారనే భయంగా ఉందన్నారు. జానీ మాస్టర్ తన గురువుతో సమానం అన్నారు అనీ మాస్టర్.

ఆ అమ్మాయి తనకు ఢీ షో ద్వారా పరిచయమని, తనకు అవకాశాలు కావాలని తరచూ మెసేజ్ పెట్టేదని, ఈ సమయంలో తానే జానీ మాస్టర్ దగ్గరికి గాని శేఖర్ మాస్టర్ దగ్గర గానీ వెళ్ళమని సలహా ఇచ్చానని చెప్పింది. ఆ అమ్మాయి ప్రతిభ గుర్తించి, జానీ మాస్టర్ లైఫ్ ఇచ్చాడని హనీ మాస్టర్ చెప్పుకొచ్చింది.
ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో నెగెటివిటీ ఎక్కువైందన్నారు. అలాగే.. ఈ విషయం చాలా సున్నితమైన విషయం కాబట్టి అందుకే ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఎవరూ కూడా మాట్లాడటం లేదన్నారు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ముందు స్పందించిది. వారికి ఆర్థికసాయం చేసేది జానీ, శేఖర్ మాస్టర్లేనని, ఆ అమ్మాయికి కూడా కార్డు ఇప్పించడం కోసం జానీ దంపతులు ఎంతో ఫైట్ చేశారని వెల్లడించారు. ఈ వివాదంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తోందో వేచి చూస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











