బిగ్ బాస్ హౌస్‌లో ఎనిమిదవ పార్టిసిపెంట్‌గా.. ఫేమస్ కొరియోగ్రాఫర్
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో ఎనిమిదవ పార్టిసిపెంట్ గా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్.. ఈటీవీలో ప్రసారమైన డీ డాన్స్ షోతో బాగా ఫేమస్ అయ్యారు. చిరంజీవి మొదలుకొని రామ్ చరణ్ వరకు అందరికీ కొరియోగ్రఫీ అందించారు. నందమూరి హీరోలకు సైతం ఈయన అందించిన కొరియోగ్రఫీ బాగా కలిసొచ్చింది. ఈ మధ్యనే దర్శకుడి అవతరమెత్తి తమిళ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ తో బిగ్ బాస్ లోకి వచ్చిన ఆయనను చూసి స్టేజ్ అదిరిపోయిందని కితాబిచ్చారు నాగార్జున.


Click it and Unblock the Notifications











