Jani Master Arrest : జానీ మాస్టర్ అరెస్ట్, బెంగళూరులో పోలీసులకు చిక్కిన స్టార్ కొరియోగ్రాఫర్

తన వద్ద పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది. అన్ని ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ వంటి కమీషన్ ఉండాలని సమంత లాంటి స్టార్ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దశలో దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్న జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆ వివరాల్లోకి వెళితే:

తెలుగులో ఓ టాప్ ఛానెల్‌లో ప్రసారమైన డ్యాన్సింగ్ షో సమయంలో బాధితురాలు జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఆమె టాలెంట్‌ను గుర్తించి తన వద్ద అసిస్టెంట్‌గా ఉండే ఛాన్స్ ఇచ్చాడు జానీ. అయితే ఓ కార్యక్రమం కోసం ముంబైలోని ఓ హోటల్‌లో దిగినప్పుడు జానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. ఈ విషయం బయటికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించినట్లుగా తెలిపారు.

choreographer Jani Master Arrested in sexual harassment case

మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు షూటింగ్ సమయంలో వ్యాన్‌లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు కూడా జానీ ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. మణికొండలోని బాధితురాలి ఫ్లాట్‌కు అర్థరాత్రుళ్లు వెళ్లి కోరిక తీర్చాలని వేధించినట్లుగా ఎఫ్ఐఆర్‌లో వెల్లడించారు. తనకు ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా దక్కకుండా చేస్తానని ఆమెను జానీ బెదిరించినట్లుగా తెలిపారు.

అయితే భర్తపై వస్తున్న ఆరోపణలను జానీ మాస్టర్ సతీమణి సుమలత ఖండించారు. తన భర్త అలాంటి వ్యక్తి కాదని, కావాలనే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మంచితనం, టాలెంట్‌ను చూసే స్టార్ హీరోలు జానీ మాస్టర్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసులో మరిన్ని ఆధారాలు , వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రేపో మాపో ఆయను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.

choreographer Jani Master Arrested in sexual harassment case

ఈ క్రమంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్‌ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆయన కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు జానీ బెంగళూరులో ఉన్నట్లుగా సమాచారం అందింది. దీంతో గురువారం బెంగళూరులోని జానీ మాస్టర్ ఉన్న చోటికి వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: jani master movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X