ఆరోపణలు నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. పొట్టకొట్టే వాడిని కాదు: జానీ మాస్టర్ ఎమోషనల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దక్షిణాదికి.. బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించిన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మరో డ్యాన్సర్ సతీష్ చేసిన ఆరోపణలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇటీవల జానీ మాస్టర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా పలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

నేను ఓ పార్టీకి, ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా TFTDDA అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా అసోసియేషన్ కోసం 5 కోట్ల రూపాయలతో ఓ స్థలం కొనుగోలు చేశాం. ఆ స్థలం వివాదంలో చిక్కుకొన్నది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని, అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఎన్నుకొన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికై 6 నెలలు అవుతున్నది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో ఆ ప్రయత్నాలకు కొంత బ్రేక్ పడింది అని జానీ వివరణ ఇచ్చారు.

Choreographer Jani Master Challenges Dancer Satish Allegations

అదే సమయంలో రంజాన్ మాసం మొదలైంది. ఈ సమయంలో నేను పాటలు వినను. కొరియోగ్రఫి కూడా చేయను. నెల రోజులు ఉపవాస దీక్షలో ఉన్నాను. ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రాంచరణ్, ఉపాసన గారితో మాట్లాడాను. యూనియన్ అభివృద్ది కోసం చర్యలు చేపట్టాం. పనులు, కావ్యాచరణ సవ్యంగా సాగుతున్నది అని జానీ మాస్టర్ తన సంస్థ కార్యకలాపాలను, తన ప్రయత్నాలను మీడియాకు తెలిపారు.

ఇలాంటి పనుల మధ్య డ్యాన్సర్ సతీష్ కొన్ని ఆరోపణలు చేశారు. ఆయేషా చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ కమిటీ ప్రకారం.. కొరియోగ్రాఫర్లతో చర్చలు జరిపిన తర్వాత అతడికి లక్ష రూపాయల జరిమానా విధించాం. మా అసోసియేషన్‌లోకి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా.. డబ్బులు ఇచ్చి ఆదుకొన్నాను. ఒకరి పొట్ట కొట్టడం విధానం కాదు. అతడు చేసిన ఆరోపణలకు పశ్చాత్తపం చెంది క్షమాణ కొరితే జరిమానా లేకుండా వదిలివేసే వాళ్లం. అలా కాకుండా నేనేంటో చూపిస్తానని బెదిరించారు అని వివాదం వెను విషయాలను జానీ మాస్టర్ వివరించారు.

Choreographer Jani Master Challenges Dancer Satish Allegations

జరిమానా విధించినప్పటికీ అది కట్టకుండా.. సినిమాలకు పనిచేశారు. పైగా నాపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజమైనా నేను ఇండస్ట్రీ నుంచి వదిలిపోతా. ఒకచోట రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ చైర్మన్‌గా ఉన్నాను. నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు. నా వల్ల తెలంగాణకు ఇబ్బంది రాకూడదని ఈ వివరణ ఇస్తున్నాను అని జానీ మాస్టర్ చెప్పారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శ శ్రీనుదేవర, అయేషా మాస్టర్, వ్యవస్థాపకులు సోమరాజు, ఎల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సతీష్ చేసిన ఆరోపణల్లో నిజాలు లేవు. జనరల్ బాడీ, అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు. సంస్థ రూపొందించుకొన్న రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. గతంలో జానీ మాస్టర్ తప్పు చేయకున్నా ఫైన్ వేస్తే జరిమానా విధించారు. నలుగురు మంచి కోరే ఆయన మీద సతీష్ అసత్య ఆరోపణలు చేశారు అని అన్నారు.

More from Filmibeat

Read more about: jani master satish jana sena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X