నాపై కుట్ర వెనుక వాళ్లే .. కోర్టు తీర్పుపై జానీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

సర్దుమణిగింది అనుకున్న జానీ మాస్టర్ వ్యవహారం గత రెండ్రోజులుగా మరోసారి చిత్ర సీమలో హాట్ టాపిక్‌గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో జానీపై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కూడా మీడియా ముందుకు రావడం మరింత దుమారం రేపుతోంది. తాజాగా జానీ మాస్టర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

బెయిల్‌పై బయటికొచ్చిన జానీ మాస్టర్ తన సినిమాలు, షూటింగ్స్, కొరియోగ్రఫీ పనుల్లో బిజీగా మారారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో జానీ మాస్టర్‌కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్టీ వర్మ .. ఫిలిం ఛాంబర్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టింది.. అలాగే జానీని డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఈ కమిటీ కోరింది.

choreographer jani master counter to anchor Jhansi social media post on court verdict

అయితే లైంగిక వేధింపుల కేసులో తనపై మోపిన అభియోగాల రుజువు కాకుండా తనను పదవి నుంచి ఎలా తప్పిస్తారంటూ ఛాంబర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం .. జానీ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ వ్యవహారంపై సీనియర్ నటీ, యాంకర్, వాయిస్ ఆఫ్ ఉమెన్‌లో సభ్యురాలు ఝాన్సీ స్పందించారు. ఛాంబర్ ఆదేశాలను జానీ మాస్టర్ సవాల్ చేయగా.. దానిని కోర్టు కొట్టేసిందని, ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా ఆమె పేర్కొన్నారు.

పని ప్రదేశాలలో మహిళల భద్రతే ముఖ్యమని .. పీవోఎస్‌హెచ్ మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్ధతు ఉంటుందని మరోసారి రుజువైందని ఝాన్సీ చెప్పారు. ఈ కేసు విషయంలో బాధితురాలకి అండగా నిలిచి, ధర్మంపై పోరాడినందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు యాంకర్ ఝాన్సీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కోర్టు తీర్పు, దానికి ఝాన్సీ పోస్ట్ పెట్టడంపై జానీ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు జానీ మాస్టర్.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జానీ మాస్టర్‌పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోంది ఎవరు? ఆయనపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. జానీ మాస్టర్ త్వరలో ఏమైనా నిజాలు బయటపెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X