jani master Arrest : జానీ మాస్టర్ అరెస్టులో ట్విస్ట్.. భార్యనే పట్టించిన వైనం!

దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్న జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం చిత్ర పరిశ్రమలో దుమారం రేపింది. తనపై కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు గురువారం గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించాయి. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తెలుగులో ఓ టాప్ ఛానెల్‌లో ప్రసారమైన డ్యాన్సింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో ఓ యువతి జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆమెకు తన వద్ద అసిస్టెంట్‌గా అవకాశం కల్పించాడు . అయితే కొద్దిరోజల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో జానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. షూటింగ్ సమయంలో కేరవ్యాన్‌లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని వెల్లడించారు. అర్థరాత్రుళ్లు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి కోరిక తీర్చాలని వేధించినట్లుగా ఎఫ్ఐఆర్‌లో వెల్లడించారు.

choreographer jani master wife ayesha sumalatha visits narsingi police station here s the details

మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు దాడి కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధితురాలికి అండగా నిలిచింది. అలాగే అమ్మాయిలు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని.. తాను బాధితురాలితో కొన్నిరోజులు పనిచేసినట్లు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలిపారు. ఆమెకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని .. క్లిష్ట పరిస్ధితుల్లో అండగా నిలిచిన ఫిలిం ఛాంబర్‌కు అనసూయ థ్యాంక్స్ చెప్పారు.

ఇదే సమయంలో జానీ మాస్టర్ కారణంగా తాము ఇబ్బందిపడినట్లు కొందరు కొరియోగ్రాఫర్లు ఆరోపిస్తున్నారు. ఆట సందీప్, హరనాథ్ మాస్టర్ సహా 100 మంది కొరియోగ్రాఫర్లను జానీ తొక్కేశాడని బషీర్ మాస్టర్ ఆరోపించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లను బానిసల మాదిరిగా చూడొద్దని బషీర్ మాస్టర్ సూచించారు. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. ఎవడి పొట్టా కొట్టొద్దని, అలాంటొళ్లు బాగుపడ్డ దాఖలాలు లేవని బషీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

choreographer jani master wife ayesha sumalatha visits narsingi police station here s the details

ఇదిలాఉండగా.. జానీ మాస్టర్‌ అరెస్ట్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతని భార్య సుమలత ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు గోవాలో జానీని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. భర్తను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న సుమలత నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకో ఫేక్ కాల్ వచ్చిందని, దానిపై ఆరా తీయడానికే పీఎస్‌కు వచ్చినట్లు ఆమె చెప్పారు.

అయితే తనపై సుమలత కూడా దాడి చేసిందని బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమలత అసలు పోలీస్ స్టేషన్‌‌కు ఎందుకొచ్చింది అనేది చర్చనీయాంశమైంది. సాయంత్రానికి గోవా నుంచి జానీ మాస్టర్‌ను పీఎస్‌కి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Read more about: jani master ayesha sumalatha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X