జానీ మాస్టర్ కేసులో ఆడియో లీక్.. వైరల్ అవుతున్న సంభాషణ ఏమిటంటే ?

Jani Master Case: ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ రేప్ కేసు హాట్ టాపిక్ గా మారింది. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ప్రకంపనాలు స్రుష్టిస్తున్నాయి. మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేశాడని, అంతే కాకుండా.. అవుట్ డోర్ పేరుతో తనని లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ తరుణంలో ఓ సంచలన ఆడియో లీక్
అయింది. ఈ ఆడియో వైరలవుతుంది. ఇంతకీ వైరల్ అవుతున్న సంభాషణ ఏమిటంటే?

గత రెండు మూడు రోజులుగా జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకోమ్మని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నారు. పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.

choreographer Johnny Master rape sexual harassment case related audio leaked audio viral

ఎట్టకేలకు జానీ మాస్టార్ పోలీసులకు చిక్కాడు. గతరాత్రి బెంగుళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం జానీ మాస్టార్ ను విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల వ్యవహారంలో పోక్సో కింద కేసు నమోదైంది. ఇదెలా ఉంటే.. ప్రస్తుతం ఓ జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన ఓ సంచలన ఆడియో లీక్ అయ్యింది. ప్రస్తుత్తం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.

ఇంతకీ ఆ ఆడియో ఏముందంటే..?

ఈ ఆడియో ఓ వ్యక్తి మాట్లాడూతూ.. ' గౌరవ గ్రూప్ సభ్యులకు నమస్కారం. ఈరోజు సాయంత్రం ఛాంబర్ లోకి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఫెడరేషన్ ప్రెసిడెంట్ దామోదర్ గారు,సెక్రెటరీ, ఇతర సభ్యులతో మధ్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో దామోదర్ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు గానీ .. గ్రూపుల్లో గానీ.. ఇంకా వేరే వేరే దాంట్లో గాని ఎక్కడైనా సరే .. వీళ్ళ పేర్లు ప్రస్తావించి ఈ విషయాన్ని గాని ప్రస్తావిస్తే.. అందరూ శిక్ష అర్హులవుతారు.ఈ జానీ మాస్టర్ కేసు విషయాన్ని డాన్సర్స్ యూనియన్,ఫెడరేషన్ , ఛాంబర్ , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు గుర్తుకు పెట్టుకోండి. దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి. ' అని వార్నింగ్ ఇచ్చారు.

choreographer Johnny Master rape sexual harassment case related audio leaked audio viral

అలాగే ఆ వ్యక్తి ఇంకా కంటిన్యూ చేస్తూ.. ' ఈ జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త గా మాట్లాడండి. ఈ విషయాన్ని అసలు మాట్లాడొద్దు. వాళ్ల పేర్లు ప్రస్తావించి ఏదైనా లబ్ధి పొందవచ్చనీ, ఏదో పేరు సంపాదించడం మాత్రం చేయొద్దు. మనకు మనకు ఎన్నికల పరంగా. వేరే విషయాల పరంగా గొడవలు ఉండొచ్చు. కానీ.. ఈ విషయాన్ని వాడుకోకండి. దయచేసి చెప్తున్నా ఇది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తవించొద్దు.. ఎవరూ మాట్లాడవద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.' అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంగా మారింది. ఈ ఆడియో నెట్టింట్లో వైరలవుతోంది. పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jani master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X