జానీ మాస్టర్ వెనుక ఇంత కుట్ర... షాకింగ్ నిజాలు చెప్పిన కొరియోగ్రాఫర్ కస్తూరి

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ - డ్యాన్సర్ శ్రేష్టి వర్మ కేసు కోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. శ్రేష్టి వర్మ కేసుతో జానీ మాస్టర్ పై ఫోకో యాక్ట్ నమోదై, జైలుకు కూడా వెళ్లి వచ్చారాయ. కొద్ది రోజుల తర్వాత బెయిల్ కూడా పొందారు. తన నుంచి ఎలాంటి తప్పులేదని మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఇక కేసు కోర్టు వరకు వెళ్లడంతో న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ సన్నిహితులు పలువురు శ్రేష్టి వర్మ చేసిన కొన్ని సంగతులను చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇప్పటికే కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్ జానీ మాస్టర్ పై సానుభూతి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ కూడా స్పందించారు. వారి అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా అసలు వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ను కావాలనే ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. ఇతరుల మంచి కోరే, పైగా శ్రేష్టి వర్మ ఎదుగుదలకు సహరించిన అతనిపైనే కేసు పెట్టడం సబబు కాదన్నారు.

Choreographer Kasturi Master Reveal Actual Plan of Sresthti Verma

అయితే.. జానీ మాస్టర్ కు శ్రేష్టి వర్మకు పుష్ప సెట్ లోనే ఘర్షణ స్టార్ట్ అయ్యిందని చెప్పారు. శ్రేష్టికి జానీ మాస్టర్ పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం కల్పించారని.. కానీ శ్రేష్టి మాత్రం సమయానికి చేతులెత్తేసిందన్నారు. ఆ కారణంగానే జానీ మాస్టర్ శ్రేష్టి వర్మ దగ్గరకు వెళ్లి ఒప్పుకున్న సినిమాకు పనిచేయాలి కదా.. డైరెక్టర్ నుంచి మాట పడాల్సి వస్తుందని వివరించారని కస్తూరి చెప్పారు. ఆ క్రమంలో తను కలిసిన చోట డోర్ తగిలి ఫ్యాన్ కింద పడిందే కానీ.. ఉద్దేశ పూర్వకంగా చేయలేదన్నారు. కొందరు కావాలని ఆయన విధ్వంసం చేశారని ఆరోపణలు చేశారన్నారు.

ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నటి మాటల ప్రకారమే.. జానీని యూనియన్ ప్రెసిడెంట్ నుంచి కూడా తప్పించారని మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండానే కుట్రపూరితంగా ఎన్నిక నిర్వహించారన్నారు. అలా తమ పవర్ ను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. పెద్ద సినిమాలకే పనిచేస్తామనే శ్రేష్టి వర్మ తీరు తప్పు అని భావించారు. పైగా వర్క్ ప్లేస్ లో జానీ మాస్టర్ అటాక్ చేశారనడం అవాస్తవమన్నారు. ఇప్పటికీ జానీ మాస్టర్ పట్ల మాట్లేందుకు చాలా మంది ఉన్నారన్నారు.

Choreographer Kasturi Master Reveal Actual Plan of Sresthti Verma

జానీ మాస్టర్ సహకరించిన ఆమె సడెన్ గా తన మాట వినకపోవడంతోనే ఆయన జస్ట్ అడిగారని తెలిపారు. కానీ శ్రేష్టి వర్మ వెనకలా మరో వ్యక్తి ఉండటం వల్లే జానీ మాస్టర్ పై కేసు నమోదైందని తెలిపింది. ముఖ్యంగా ఝాన్సీ సలహాల వల్లే ఇలా జరిగిందని కస్తూరి అభిప్రాయపడ్డారు. శ్రేష్టి వర్మకు తెలియనివన్ని చెప్పి వాటెండ్ గా కేసు పెట్టించారని ఆమె అనుమానించారు. తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవీ నుంచి తొలించేందుకే కుట్ర జరిగిందన్నారు. ఇక జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని.. ఆయన వల్లే చాలా మందికి పని దొరుకుతుందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X