జానీ మాస్టర్ జీవితాన్ని నాశనం చేసింది? శ్రేష్టి వర్మపై మండిపడ్డ ఆర్కే మాస్టర్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ - డ్యాన్సర్ శ్రేష్టి వర్మ మధ్య జరిగిన వివాదం గురించి తెలుగు ఆడియెన్స్ కు తెలిసిందే. గతేడాది మధ్యలో ఈ గొడవ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఏకంగా జానీ మాస్టర్ పై కేసు కూడా నమోదై నెలరోజులకు పైగా ఆయన జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. ఎంతో మంది స్టార్ హీరోలతో మాస్ స్టెప్పులు వేయించిన జానీ మాస్టర్ కు ఈ పరిస్థితి రావడం పట్ల చాలా మంది అభిమానులు చింతించారు.

మైనర్ బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో జానీ మాస్టర్ ను గతేడాది సెప్టెంబర్ 19న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఆయన్ని 36రోజులు చంచల్ గూడ జైలు నిందితుడిగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పొందారు. పోక్సో యాక్ట్ నమోదవడంతో ఇంకా విచారణ కొనసాగుతోంది. జైలు నరకం చూశానని, కొన్ని రోజులు తనకు మనిషనే భావనే చనిపోయిందని చెప్పిన మాటలు అప్పట్లో ఆ అభిమానులను కలిచివేసింది.

Choreographer RK Master fire on Shresthti Verma behaviour

అయితే.. తాజాగా జానీ మాస్టర్ కు ఎంతో సన్నిహితుడైన కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్ కొన్ని విషయాలను తెలియజేశారు. శ్రేష్టి వర్మ - జానీ మాస్టర్ మధ్య ఏం జరిగిందో తెలిపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే శ్రేష్టి వర్మ ప్రవర్తన కాస్తా మెచ్చుర్డ్ గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుందని.. ఒకరికి ఇష్టలేకుండా, వారి అనుమతి లేకుండా ఎవరు ఎవరిని ఏమీ చేయలేరని చెప్పారు.

జానీమాస్టర్ తనకు ఎంతగానో తెలుసని, ఆయన మంచితనం తను కళ్లారని చూశానని చెప్పారు. ఎంతో మందికి వీలైనంతగా ఆర్థికసాయం చేయడం, పని కల్పించాడన్నారు. తన సొంత డబ్బులనే సాయంగా అందించారని, అమ్మాయిల విషయంలోనూ ఎంతో గౌరవంగా ఉండేవారని, తనకు తెలిసినంత వరకు ఎక్కడా అతన్ని ఇండస్ట్రీలోని వ్యక్తులు తప్పుగా చెప్పలేదన్నారు. ఎవరి ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. కానీ తమ ఎదుగుదలకు కారణమైన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దని, అది సరైన ప్రవర్తన కాదని సూచించారు. తను ఈ స్థాయిలో ఉండటానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్, తదితరులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

Choreographer RK Master fire on Shresthti Verma behaviour

కానీ శ్రేష్టి వర్మకు ఎంతో సహకరించి.. తన కెరీర్ ను ముందుకు తీసుకొచ్చిన జానీ మాస్టర్ కే ఇలాంటి పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. పైగా ఇప్పుడు ఆయన కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్ కమింగ్ ఫిల్మ్స్ తో ఆయన పేరు ను వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతో సహకారంగా ఉన్న జానీ మాస్టర్ జీవితాన్నే నాశనం చేసిందని పరోక్షంగా ఆర్కే మాస్టర్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే శ్రేష్టి వర్మ ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపైనా కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై లావణ్య పోలీసులు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది. మరోవైపు జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో శేఖర్ బాషా కావాలనే తన కాల్ రికార్డ్స్ ను లీక్ చేశారని శ్రేష్టి వర్మ ఫిర్యాదు చేసింది.

More from Filmibeat

Read more about: jani master telugu cinema news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X