SSMB29: రాజమౌళి తో గొడవ ?.. మహేష్ సినిమా నుంచి తప్పుకున్న సెంథిల్..
SSMB29: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసింది. SSMB29 అనే భారీ బడ్జెట్ మూవీ కోసం..మహేష్ బాబు ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు తలపించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో రాజమౌళి బిజీగా ఉన్నా విషయం తెలిసింది. అయితే ఈ మూవీ నుండి ఓ బాధాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఆ సాడ్ న్యూస్ ఏంటంటే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ సెంథిల్.. ఈ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొరియోగ్రాఫర్ సెంథిల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్టర్ రాజమౌళి తీసిన సినిమాలన్నిటికీ సెంథిల్. కెమెరామెన్ గా పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మగధీర, సై ,ఈగ ,బాహుబలి, RRR వంటి సినిమాలకు సెంథిల్ కెమెరామెన్ గా వర్క్ చేశారు.

ఆయన కొరియోగ్రఫీ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ ట్గా నిలిచాయి. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ లో పలు రికార్డులను క్రియేట్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో బహుబలి తెలుగు సినిమా కీర్తిని దేశవ్యాప్తం చేస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ ను సొంతం చేసుకుంది. అంటే.. ఏ లెవెల్లో ఆయన టేకింగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సక్సెస్ ఫుల్ కెమెరామెన్ సెంథిల్.. మహేష్ బాబు సినిమా నుండి తప్పుకున్నారట.
తాజాగా కెమెరామెన్ సెంథిల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో తాను వర్క్ చేయడం లేదని తెలిపాడు. రాజమౌళి, సెంథిల్ మధ్య గొడవ జరిగిందనే ప్రచారం స్పందించారు సెంథిల్. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఒక సినిమా చేయకపోతే.. తనకు నాకు గొడవ జరిగినట్లు కాదని, మధ్యలో కూడా తాను కొన్ని మూవీస్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఒక్క సినిమా చేయకపోతే ఉన్న రిలేషన్ చెడిపోయినట్లు కాదని మరోసారి చెప్పుకొచ్చారు కొరియోగ్రాఫర్ సెంథిల్ .
మహేష్ బాబు సినిమాలో తనను ఎందుకు తీసుకోవడం లేదని విషయంపై తాను ఏం మాట్లాడలేదని, ఈ విషయాన్ని గురించి రాజమౌళిని అడుగుతే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. ప్రతి డైరెక్టర్ కు ఓ ప్రత్యేక కథ ఉంటుంది. కాబట్టి ఆ కథ ప్రకారమే టెక్నీషియన్స్ ను ఎన్నుకుంటారనీ, అయితే.. ఈ సినిమాకు తాను సరికాదని, వేరే టెక్నీషియన్లు వెతుక్కుంటారని పేర్కొన్నారు. ఈ సినిమాకు తనకంటే బెటర్ పర్సన్ రాజమౌళికి దొరికినట్టు ఉన్నాడని, అందుకే నన్ను పక్కన పెట్టి ఉండొచ్చని చెప్పుకొచ్చారు కెమెరామెన్ సెంథిల్. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ తో సరికొత్త అవకాశాలు వస్తాయని, మనం కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటామనేది సవాల్ అని కొరియోగ్రాఫర్ సెంథిల్ తెలిపారు .


Click it and Unblock the Notifications











