Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Project K: ప్రభాస్ కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్టు.. పాన్ వరల్డ్ అంటే ఇంతే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో సందడి చేసి.. స్టార్ హీరోగా హవాను చూపించాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన తర్వాత అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అప్పటి నుంచి సినిమాల వేగాన్ని తగ్గించాడు. తన అభిమానులకు అసలైన ట్రీట్ ఇవ్వాలన్న లక్ష్యంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే 'సాహో' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక, ఇటీవలే ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది.
అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభాస్ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరో ఏకంగా నాలుగు సినిమాలను కూడా మొదలు పెట్టేసి షాకిచ్చాడు. దీంతో ప్రభాస్ తీరిక లేని షెడ్యూళ్లు జరుపుకుంటూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు. ఇలా ఈ స్టార్ హీరో చేస్తోన్న సినిమాల్లో 'ప్రాజెక్టు K' ఒకటి. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చిత్ర యూనిట్ హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు కొందరు కీలక నటులతో పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేశారు.

పాన్ వరల్డ్ రేంజ్లో ఎంతో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'ప్రాజెక్టు K' సినిమాలో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఉన్న ఎంతో మంది నటీనటులు భాగం కాబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను.. సైంటిస్ట్ పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తీసుకున్నారు. అలాగే, వీళ్లతో పాటు మరికొందరు స్టార్లు కూడా నటిస్తారని అన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఎంతో ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ భామ దిశా పటానీని తీసుకుంటున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!
క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న 'ప్రాజెక్టు K' మూవీలో ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పని చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, తాజాగా ఈ మూవీ కోసం ఇంటర్నేషన్ కొరియోగ్రాఫర్ శిఫు అశ్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఈ సినిమాలో కంబాట్ డ్యాన్స్ (పోరాటలతో సాగే నృత్యం)తో ఓ సీక్వెన్స్ ఉంటుందట. దీనికోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిఫు అశ్ను తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో కొందరు డ్యాన్సర్లతో ఈ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'ప్రాజెక్టు K' సినిమా టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన సైంటిస్ట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా కీలక పాత్రలను చేస్తున్నారు.