Shrasti Verma: ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌తో కనిపించిన శ్రేష్టి వర్మ.. పోస్ట్ వైరల్

తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రేష్టి వర్మ అనే లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు చిత్ర సీమలో సంచలనం సృష్టించాయి. శ్రేష్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దశలో జానీ మాస్టర్‌ నేషనల్ అవార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, బెయిల్, తిరిగి ఆయన కొరియోగ్రాఫర్‌గా బిజీ కావడం చకచకా జరిగిపోయాయి. శ్రేష్టి వర్మ అసిస్టెంట్ నుంచి స్వయంగా సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వచ్చింది. తాజాగా శ్రేష్టి వర్మ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జానీ మాస్టర్‌కు రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కాగా ఆయనకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం జానీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.

choreographer Shrasti Verma Thanks to Ganesh Acharya for his guidance

శ్రేష్టి వర్మ వరుస ఇంటర్వ్యూలు
జానీ మాస్టర్ వివాదం తర్వాత తన గుర్తింపును దాయడానికి శ్రేష్టి ప్రయత్నించలేదు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది. నాలుగేళ్ల క్రితమే జానీతో వివాదం ఉన్నప్పుడు అప్పట్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని కొందరు అడుగుతున్నారని.. కానీ మైనర్‌గా ఉండి, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి లేదని చెప్పింది శ్రేష్టి. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడమా? లేక ఆత్మహత్య చేసుకోవడమా? అనే ఆప్షన్లే నా దగ్గర ఉన్నాయని పేర్కొంది.

అవార్డ్ రద్దుకు సంబంధం లేదు
జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డ్ రద్దు కావడానికి తాను కారణం కాదని కూడా శ్రేష్టి వర్మ క్లారిటీ ఇచ్చింది. అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని.. అందుకే అవార్డ్ రద్దు అయ్యిందని ఆమె తెలిపారు. అయితే జానీ మాస్టర్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని.. ఆయన కెరీర్‌ను కొందరు కావాలనే నాశనం చేశారని పలువురు కొరియోగ్రాఫర్లు ఆరోపించారు. ఈ వివాదం తర్వాత తిరిగి సెట్‌లో అడుగుపెట్టిన జానీ మాస్టర్‌కు చిత్ర యూనిట్ ఘనస్వాగతం పలికింది. స్వయంగా గుమ్మడికాయతో దిష్టి తీసి, కేక్ కట్ చేయించారు. తనపై చూపిన అభిమానానికి జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు.

కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన శ్రేష్టి
ఇదిలాఉండగా.. శ్రేష్టి వర్మ కూడా అసిస్టెంట్ స్థాయి నుంచి కొరియోగ్రాఫర్‌గా టర్న్ అయ్యింది. పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తూ బిజీ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మాయి.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, డ్యాన్స్ రిహర్సల్స్‌ను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం శ్రేష్టి వర్మ నాగబంధనం అనే సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ పూర్తి అయినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

ఆయనకు థ్యాంక్స్
ఇందిలో స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను ఆకాశానికెత్తేసింది. తనకు నాగబంధనంలో సాంగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. మీ నుంచి చాలా నేర్చుకున్నానని.. మా గైడెన్స్, సహనం తనపై ఎంతో ప్రభావం చూపాయని శ్రేష్టి వర్మ తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు, జానీ మాస్టర్ అభిమానులు భగ్గుమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X