Shekhar Basha: శ్రేష్టి వర్మ ఎంట్రీ.. శేఖర్ బాషాపై మరో కేసు.. ఏం జరిగిందంటే?
Shekhar Basha: టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తుంది. తమను లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయిపై లావణ్య చేసిన ఫిర్యాదు పై విచారణ జరుగుతూ ఉండగా.. ఇప్పుడు శేఖర్ భాషా బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాకు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఎవరూ ఊహించిన విధంగా శేఖర్ బాషాపై మరో కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే?
బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాకు ఎదురుదెబ్బ తగిలింది. లావణ్య చేసిన ఫిర్యాదు పై విచారణ జరుగుతుండగా ఇప్పుడు శేఖర్ భాషాపై కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్స్ రికార్డు లీక్ చేశాడని శ్రేష్టి వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో శేఖర్ బాషా మాట్లాడారని, ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.

అంతకాకుండా.. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని కోరింది. శ్రేష్టి వర్మ ఫిర్యాదుతో శేఖర్ బాషాపై బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.మరోవైపు మస్తాన్ సాయి కేసు లో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వీడియోస్ ని గుర్తించారు.
మరోవైపు.. లావణ్యను ఉద్దేశాపూర్వకంగానే డ్రగ్స్ కేసులు ఇరికించారనీ, ఇటు మస్తాన్ సాయి, శేఖర్ బాషా సన్నిహితులని, వారిద్దరూ మాట్లాడుతున్నటు ఓ ఆడియో వెలుగులోకి వచ్చినట్టు టాక్. ఇటువంటి పరిస్థితిలో శేఖర్ బాషాపై మరొక కేసు నమోదైంది. నార్సింగ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ నర్సింగ్ పోలీసులు శేఖర్ భాష పై నమోదు చేసినటు తెలుస్తోంది. ఒకవైపు డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల విచారణ కొనసాగుతుంటే.. శేఖర్ బాషపై కేసునమోదు కావడం చర్చనీయంగా మారింది.

అలాగే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శేఖర్ బాషపై కేసు నమోదనట్టు తెలుస్తోంది. లక్ష్మీ పడాల అనే యువతి .. తనని ప్రేమ పేరుతో మోసం చేసాడంటూ కంప్లైంట్ చేసింది. ఇలా ఇప్పటివరకు శేఖర్ బాషా పైన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులకు సంబంధించి ఒక వైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు లావణ్య కేసులో శేఖర్ భాషను అరెస్టు చేయబోతున్నట్లు తెలుస్తోంది. లావణ్య కేసులో కీలక నిందితులుగా ఉన్న మస్తాన్ సాయి విచారణ మరికొద్ది సేపట్లో ముగిసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మూడు కేసుల్లో ఏదోక కేసులో పోలీసులు శేఖర్ బాషాను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











