‘చేతకాక మా మీద తోసేస్తున్నారు... చిరంజీవి మూవీ కోసం తలవంచుతున్నా’

టాలీవుడ్‌లోని సీనియర్ కెమెరామెన్‌లలో ఛోటా కే నాయుడు కూడా ఒకరు. 45 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో భాగమైన ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు డీవోపీగా పనిచేశారు. సినీరంగానికి అందించిన సేవలకు గాను నంది అవార్డ్స్ సహా పలు పురస్కారాలను అందిస్తున్నారు. తాజాగా ఓ సినిమా గ్లింప్స్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు పంచుకున్నారు. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర ఆలస్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్

జగపతి బాబు, లయ జంటగా నటించిన చిత్రం వదలా. హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. కార్తీక్ బీ కొడకండ్ల సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వదలా మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛోటా కే నాయుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు

Chota K Naidu Interesting Comments on Mega Star Chiranjeevi s Vishwambhara Delay and CGI Work

సినిమాలన్నీ ఇప్పుడు బిగ్‌స్కేల్ అయిపోయాయి కదా. సీజీలు, గ్రాఫిక్స్, పాన్ ఇండియా సినిమాలని చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్కులు చేసినప్పుడు ఇందులో కెమెరామెన్ రోల్ ఎంత ఉంటుంది? ఒక కెమెరామెన్‌ ఉంటే క్వాలిటీ హై వస్తుంది.. ఒక కెమెరామెన్ ఉంటే రాదు అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. నిజంగా ఈ సీజీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఛోటా కే నాయుడు స్పందించారు. సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్లేదు.. సీజీ వాడు ఇంపార్టెంట్. వాడెంత బాగా తీస్తే ఆ కెమెరామెన్ అంత మంచి రిజల్ట్ ఇస్తాడు. సినిమా సక్సెస్‌కి ఫెయిల్యూర్‌కి ఏ రకంగానూ కెమెరామెన్‌కి సంబంధం లేదు. వాళ్లకి ఏం కావాలో వాళ్లని అడిగి .. వాళ్ల అప్రూవల్‌తో చేస్తాం. చివరికి నేను కూడా అంతే... నేను పెద్ద పుడింగిని, నేను అంజీ చేశాను, ఢమరుకం చేశను.. అంజీకి నాకు నంది అవార్డ్ వచ్చింది అని చెప్పడం లేదని ఛోటా కే నాయుడు అన్నారు.

Recommended For You
ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్
ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్

అవతలి పక్కన అప్రెంటీస్ గాడైనా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా.. వాడికి ఏం కావాలి? ఏం అడిగితే అది 100 శాతం వాడికి ఓకే అయితేనే. కెమెరామెన్ ఇగో పక్కనపెట్టేయాల్సిందే. ఈ లైట్ ఇటు పక్క నుంచి కావాలా? మాకు తెలుసు ఆ లైట్ ఇలా పెట్టడం రాంగ్ అని మాకు తెలుసు. వాడు అడిగిన లైట్ రాంగ్ అని తెలిసినా.. క్వాలిటీ బాగోకపోతే కెమెరామెన్ కోపరేట్ చేయలేదని వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి చెడ్డపేరు తెచ్చుకోవడం ఆ ప్రాజెక్ట్‌కి మంచిది కాదు.. ఆ కెమెరామెన్‌కి మంచిది కాదు. అందుకని వాడికి ఏం కావాలో అదే చేస్తున్నాం.. రాకపోతే వాడి ఖర్మ. మా తప్పయితే ఏం లేదు.. ఏ కెమెరామెన్ అయినాసరే. చివరికి అప్రెంటీస్ కెమెరామెన్ అయినాసరే వాడు చెప్పింది చేయడమే. ఔట్‌పుట్ వస్తే క్రెడిట్ వాడికి.. బ్యాడ్‌నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్‌దేనని ఛోటా కే నాయుడు పేర్కొన్నారు.

You May Also Like
డబ్బులిచ్చి దుష్ప్రచారం.. నాపై కుట్ర వెనుక వాళ్లే.. ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్
డబ్బులిచ్చి దుష్ప్రచారం.. నాపై కుట్ర వెనుక వాళ్లే.. ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్

మీడియా కానీ, జనం కానీ మాట్లాడటం లేదు. తెరవెనుక కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటున్నాడు చెడదొబ్బినాడు. సీజీ ఏ రకంగానూ కెమెరామెన్‌కి సంబంధం లేదు. ప్రస్తుత కాలం సీజీ కోసం సెపరేట్‌‌గా ఒక టెక్నీషియన్ వచ్చాడు. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండేవి.. ఇప్పుడు సీజీ కోసం ఒక టెక్నీషియన్‌ని తెచ్చుకుంటున్నాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ చేసే వరకు అతను మాతోనే ట్రావెల్ అవుతాడు. అతనికి చెప్పకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేం తీయం... తీయకూడదు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్ అయిపోయాయి సినిమాలు. అందుకనే మేం కూడా అతను లేకుండా ఒక్క షాట్ కాదు కదా? అసలు కెమెరా యాడ్ చేయడం లేదు. సెట్‌కి వెళ్లగానే సీజీ టెక్నీషియన్ వచ్చాడా అని అడుగుతున్నానని ఆయన తెలిపారు.

'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’
'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’

అంజీ కోసం తలెత్తుకుని పనిచేశాం.. విశ్వంభర అయితే తలదించుకుని పనిచేయాల్సి వస్తోంది. ఎందుకంటే విశ్వంభర అనేది సీజీల పరంగా పీక్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లి నేను ఛోటా కే నాయుడు.. తొక్కా తోలు అంటే దొబ్బదు. అందుకే వాళ్లకు ఏం కావాలో అది ఇవ్వాలి. ఎందుకంటే ఆ సినిమా వెనుక 400 కోట్ల రూపాయలు ఉన్నాయి. అక్కడికిపోయి నా ఈగో చూపిస్తే వర్కవుట్ అవ్వదు. అందుకని వాళ్లకి ఏం కావాలో అదే చేశాం... అందుకే సినిమా చాలా టైం తీసుకుంటోంది. ది బెస్ట్ ఔట్‌పుడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ఛోటా కే నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విశ్వంభర బడ్జెట్ 400 కోట్ల రూపాయలని ఆయన లీక్ చేసినట్లయ్యింది. అలాగే సినిమా ఎందుకు లేట్ అవుతుందో కూడా ఛోటా క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X