జూలై 31న టెనెట్ మూవీ రిలీజ్.. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో..

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఏకైక హాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రం టెనెట్. ఓ పక్క అన్ని దేశాలను కరోనావైరస్ కుదిపేస్తుండగా టెనెట్ చిత్రాన్ని జూలై 31న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు శుక్రవారం ప్రముఖ పంపిణీ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రకటించింది.

జూలైలో సినిమా హాళ్లను ఓపెన్ చేయాలనే నిర్ణయం తీసుకొంటుండగా టెనెట్ రిలీజ్‌కు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు కనిపించింది. వాస్తవానికి ఈ సినిమాను జూలై రెండోవారంలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. రెండు వారాల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వార్నర్ బ్రదర్స్ స్టూడియో చేస్తున్నది.

Christopher Nolans Tenet movie releasing on July 31st

టెనెట్ మూవీ రిలీజ్‌పై ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ ఆపరేటర్లు ఏఎంసీ థియేటర్స్ స్పందిస్తూ.. జూలై రెండో వారం కల్లా ప్రపంచంలో 97 శాతానికిపైగా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయని తెలిపింది. ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ థియేటర్స్ ఓనర్స్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 90 నుంచి 95 శాతం వరకు థియేటర్లు ఓపెన్ కావడానికి ఆస్కారం ఉంది అని చెప్పారు.

ఇక మే 21వ తేదీన రిలీజైన టెనెట్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, ఎలిజబెత్ దెబికి, క్లెమెన్సే పోసీ, ఆరానో టైలర్ జాన్సన్; మైఖేల్ కైనే, కెన్నెత్ బ్రనగ్, అలాగే డింపుల్ కపాడియా కూడా ఓ కీలక పాత్రను పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X