Dinesh Phadnis: సీఐడీ సీరియల్ నటుడు ప్రణీత్‌కు గుండెపోటు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?
సీఐడీ సీరియల్.. ఈ పేరు వింటేనే చాలా మంది ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటారు. 90వ దశకంలో ఈ సీరియల్ ను చూసే వాళ్ల సంఖ్య విపరీతంగా ఉండేది. పదేళ్ల క్రితం వరకు కూడా ఈ సీరియల్ ను అన్ని భాషల్లోకి డబ్ చేసి మరీ టీవీల్లో ప్రసారం చేశారు. చాలా మంది రాత్రి 10.30 గంటల వరకు వేచి చూసి మరీ ఎపిసోడ్ మొత్తం చూసేవారు. ఇంతటి అద్భుతమైన సీరియల్ లోని నటులు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా అందులోని సీఐడీ టీం మెంబర్స్ ను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఎప్పటికీ.
అయితే ఈ టీం హెడ్ ప్రద్యుమ్న కాగా.. అభిజీత్, జోసెఫ్, ప్రణీత్, సారిక, సచిన్, డాక్టర్, సాగరిక లుగా ఆ సీరియల్ నటులు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సీరియల్ లో ఎప్పుడూ కామెడీ క్యారెక్టర్ లో కనిపించే ప్రణీత్ ను ఇష్టపడని వాళ్లు ఉండరు. అయితే సీరియల్ లో ప్రణీత్ గా కనిపించిన ఆయన అసలు పేరు దినేశ్ ఫడ్నీస్.. ప్రస్తుతం ఆన గుండెపోటుకు గురయ్యారు. డిసెంబర్ ఒకటో తేదీన ఆయనకు హార్ట్ ఎటాక్ రాగా.. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులను ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారట. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజులుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయనను చూసేందుకు పలువురు నటులు ఆస్పత్రికి కూడా వెళ్తున్నారట. అయితే ఆయన ఆస్పత్రిలో చేరింది నిజమే అయినా గుండెపోటు వల్ల మాత్రం కాదని ఆయన సహ నటుడు దయానంద్ శెట్టి స్పందించారు. దినేశ్ ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారని.. కానీ గుండెపోటు రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త బాగానే ఉందని.. శరీరం ట్రీట్ మెంట్ కు స్పందిస్తుందని ,టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదని వివరించారు.
ఒక్క సీఐడీలోనే కాకుండా దినేశ్ ఫడ్నీస్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా అనే సూపర్ డూపర్ హిట్టు సీరియల్ లో కూడా ఆయన నటించాడు. ప్రస్తుతం 57 ఏళ్ల వయసు ఉన్న ఈయన సర్ఫరోష్, సూపర్ 30 అనే హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈయన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటాడు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.


Click it and Unblock the Notifications











