twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ఓకే చేసిన కధతో 'సినిమా బండి'.. తెర మీదకు రచయిత.. సంచలన ఆరోపణలు!

    |

    ఈ మధ్యకాలంలో సినిమా సూపర్ హిట్ అవుతున్న సినిమాల మీద కాపీ మరకలు పడడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే ఈ సినిమా కథ తమదేనంటూ కొందరు మీడియాకి ఎక్కుతుండగా కొందరు మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారు. అలా ఈ మధ్యనే ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమా బండి తనకు సంబంధించిన కథ అంటూ ఒక రచయిత వెలుగులోకి వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే.

    సినిమా బండి

    సినిమా బండి


    ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఈ మధ్యకాలంలో సినిమా బండి అనే ఒక చిన్న బడ్జెట్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో ఈ సినిమా నేపథ్యం అంతా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

    నా కధ లాగానే ఉంది

    నా కధ లాగానే ఉంది

    ప్రవీణ్ కాండ్రేగుల అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా కథ తనదేనని తాజాగా ఒక దర్శకుడు తెర మీదకు వచ్చారు. అయితే ఆయన ఇప్పటికీ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ తాను చేయాలనుకున్న సినిమా కథ ఈ సినిమా కథను పోలి ఉంటుందని తాను ఈ సినిమా దర్శకులు నిర్మాతలకు ముందే చెప్పినా వాళ్లు సినిమా రిలీజ్ చేశారని ఆరోపిస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చారు.

    అల్లరి నరేష్ వద్దకు తీసుకెళితే

    అల్లరి నరేష్ వద్దకు తీసుకెళితే


    తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సదరు దర్శకుడు ఈ సినిమా ముందు తాను అల్లరి నరేష్ తో చేయాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు. సదరు దర్శకుడు పేరు శ్రీవాస్తవ కాగా తాను ముందుగా విశాఖపట్నానికి చెందిన బాబ్జి అనే ఒక డిస్ట్రిబ్యూటర్ తో కలిసి సినిమా చేయాలని భావించానని అన్నారు. బాబ్జి నిర్మాతగా వ్యవహరిస్తారని మాట ఇవ్వడంతో కధ అల్లరి నరేష్ వద్దకు తీసుకెళితే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పుకొచ్చారు.

    ప్రవీణ్ సత్తార్ కి కథ చెప్పడంతో

    ప్రవీణ్ సత్తార్ కి కథ చెప్పడంతో

    అయితే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రవీణ్ సత్తార్ తో చేయబోతున్న సినిమా కోసం మరో కథ కావాలని అడిగితే ప్రవీణ్ సత్తార్ కి కథ వినిపించానని ఆ సమయంలో ఈ సినిమా కథ గురించి అడగగా అప్పుడు ఆయనకు చెప్పానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇదే కథాంశంతో సినిమా బండి తీస్తున్నారని తెలుసుకుని దర్శక నిర్మాతలను సంప్రదించాలని ఆయన అన్నారు.

    సోల్ ఒక్కటే

    సోల్ ఒక్కటే

    అయితే తాను అనుకున్న సినిమాలో ఒక ఊరికి కష్టం వస్తే ఆ ఊరి వారంతా కలిసి సినిమా తీసి ఎలా ఆ కష్టం నుంచి బయటపడ్డారు అనే అంశంతో చేయాలని అనుకున్నానని అన్నారు. కానీ ఈ సినిమాలో ఇక్కడ కెమెరా దొరుకుతుందని, కెమెరాతో సినిమా చేయడం మొదలు పెట్టాక ఊరంతా ఏకమవుతుందని చెప్పుకొచ్చారు. నేపథ్యాలు వేరు అయినా సరే ఇక్కడ కథలో ఉన్న సోల్ మాత్రం గ్రామస్తులు సినిమా చేయడమేనని అన్నారు. తాను ఈ సినిమా కథను రిజిస్టర్ కూడా చేయించుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
    కథను చేయించకుండానే

    కథను చేయించకుండానే

    అయితే కథను రిజిస్టర్ కూడా చేయించకుండానే దర్శక నిర్మాతలు ఈ సినిమా తీసి రిలీజ్ కూడా చేశారని ఈ విషయంలో తాను ఫిలిం ఛాంబర్ కు వెళ్తా అని హెచ్చరించినా వాళ్ళు తన మాట వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన ధర్మేంద్రకి కూడా ముందే ఈ కథ తెలుసని అయినా ఆయన అడ్డు చెప్పలేదని ఆయన వాస్తవ్ ఆరోపించారు.

    English summary
    Cinema Bandi is feel good Telugu Comedy film Produced by the director duo Raj Nidimoru and Krishna D.K, and directed by Praveen Kandregula, the film was recently released on Netflix. Now new controversy arose in this issue. a director named Sri Vasthava alleged that story is same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X