VD12: విజయ్ దేవరకొండ కోసం విక్రమ్ స్టార్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ
టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిన వాళ్లు అతి తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. అందులో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా పరియమైన కొత్తలోనే భారీ సక్సెస్‌లను సొంతం చేసుకున్న అతడు.. తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఈ జోష్‌లోనే గత ఏడాది 'లైగర్' అనే పాన్ ఇండియా చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఖుషి' అనే మూవీ చేస్తోన్నాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న 'ఖుషి' మూవీ షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే.. తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. అలాగే, నేను ఎక్కడివాడినో, ఎవరిని మోసం చేశాను తెలియదు అంటూ పోస్టర్‌పై రాశారు. అలాగే, బ్యాగ్రౌండ్ కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. దీంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను గురువారమే అంగరంగ వైభవంగా జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ చిత్రానికి 'విక్రమ్' 'జల్లికట్టు' ఫేం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ టాలెంటెడ్ కెమెరామెన్ ఏ సినిమా చేసినా అందులో విజువల్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది విజయ్ దేవరకొండతో చేస్తే వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. నిజంగా ఇది అతడి అభిమానులకు కిక్కిచ్చే న్యూసే అనడంలో సందేహం లేదు.
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











