Mahesh Babu: 'గుంటూరు కారం'లో వాళ్లను మార్చలేదు.. మహేశ్ బర్త్ డేతో అసలు క్లారిటీ
గుంటూరు కారం.. ఈ సినిమా (Guntur Kaaram Movie) మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటోంది. అలాగే షూటింగ్ కూడా ఆలస్యంగా జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డేతోపాటు పలువురిని తప్పించినట్లు, వారి స్థానంలో కొత్త వాళ్లను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ, తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న అంటే ఇవాళ వాటన్నింటికి అసలైన క్లారిటీ వచ్చేసింది. అది ఎలా అనే విషయంలోకి వెళితే..
నిర్మాతలు: హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మహేశ్ బాబు తాజా సినిమా గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు.

సాగని షూటింగ్: గుంటూరు కారం సినిమాను ఏ సమయంలో మొదలు పెట్టారో కానీ, ఆది నుంచి ఆటంకాలే ఏర్పడుతున్నాయి. ఒక సమయంలో గుంటూరు కారం సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ మొత్తం మార్చి మహేశ్ బాబును ఒప్పించాడని టాక్ వచ్చింది. తర్వాత సినిమా మొదలైంది కానీ, షూటింగ్ మాత్రం సజావుగా సాగలేదన్న విషయం తెలిసిందే.

ఆ సినిమా నుంచి: ఇక గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయిన తర్వాత మహేశ్ బాబు (Mahesh Babu) కుటుంబంతో అనేకసార్లు ఫారెన్ టూర్స్ వేశారు. దీంతో బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ప్రకటించిన తర్వాత ఆయన్ను తీసివేసినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. దానిపై తమన్ ఫైర్ కూడా అయ్యారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి త్రివిక్రమ్ చిత్రాలకు తమన్ పని చేస్తున్నారు.

పోస్టర్ ద్వారా: అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాలతోపాటు సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించే చిత్రాలకు సైతం తమనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. అది తాజాగా మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలిసిపోయింది. ఆ పోస్టర్ లో తమన్ పేరు తప్పా ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు. దీంతో ఆయనే గుంటూరు కారం సినిమాకు మ్యూజిక్ కొడుతున్నట్లు తేలిపోయింది.

మారిన రిలీజ్ డేట్: తమన్ తోపాటు సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అతని స్థానంలో రవి కే. చంద్రన్ వస్తారని టాక్ నడిచింది. కానీ గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్ లో పిఎస్ వినోద్ మాత్రమే ఉంది. ఇలా మహేశ్ బాబు పుట్టిన రోజు పోస్టర్ ద్వారా.. తమన్, పిఎస్ వినోద్ ఇద్దరినీ మార్చలేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు మేకర్స్. కాగా గుంటూరు కారం విడుదల తేది మాత్రం మారింది. ముందుగా వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ అని చెప్పారు. కానీ అది కాస్తా ఇప్పుడు 2024 జనవరి 12కు మారిపోయింది.


Click it and Unblock the Notifications











