షాకింగ్: బాలయ్య సినిమా నుంచి బిగ్ ఫిగర్ ఔట్: తప్పించారా.? ఆయనే తప్పుకున్నారా.?

By Manoj

నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరో. నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య ఆయన కెరీర్ ఆశించినంతగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో నందమూరి హీరో గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

 ఒకటి కాదు.. రెండు కాదు హ్యాట్రిక్ చేశాడు

ఒకటి కాదు.. రెండు కాదు హ్యాట్రిక్ చేశాడు

గత ఏడాది నందమూరి బాలకృష్ణకు అంతగా కలిసి రాలేదు. 2019లో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. సంవత్సరం ప్రారంభంలో తన తండ్రి బయోపిక్‌గా విడుదలైన రెండు భాగాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అలాగే, గత డిసెంబర్‌లో వచ్చిన ‘రూలర్' కూడా అదే ఫలితాన్ని అందుకుంది. దీంతో ఆయన ఖాతాలో ఫ్లాప్‌ల హ్యాట్రిక్ నమోదైంది.

రెండు హిట్‌ల తర్వాత ఆయనతో కలిశాడు

రెండు హిట్‌ల తర్వాత ఆయనతో కలిశాడు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటి తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలవడంతో దీనిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది.

సినిమా స్టార్ట్ కాకుండానే మొదలయ్యాయి

సినిమా స్టార్ట్ కాకుండానే మొదలయ్యాయి

ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం పూర్తయ్యాయి. అయితే, అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఇందులో నటించే ఆర్టిస్టుల వివరాలతో పాటు సినిమా బడ్జెట్.. రెమ్యూనరేషన్స్ సహా ఎన్నో అంశాలపై పుకార్లు షికార్లు చేశాయి. అలాగే, ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఊహాగానాలు వైరల్ అయిపోయాయి.

సినిమా ఆలస్యం.. ఆ లుక్కుతో పుల్‌స్టాప్

సినిమా ఆలస్యం.. ఆ లుక్కుతో పుల్‌స్టాప్

వాస్తవానికి ఈ సినిమా ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అదే సమయంలో ఈ సినిమా స్క్రిప్టు వర్క్ కారణంగా ఆలస్యం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన బాలయ్య లుక్కుతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ప్రస్తుతం బాలయ్య గెటప్ బోయపాటి సినిమా కోసమేనన్న టాక్ వినిపిస్తోంది.

భారీ ప్రాజెక్టు నుంచి బిగ్ ఫిగర్ అవుట్

భారీ ప్రాజెక్టు నుంచి బిగ్ ఫిగర్ అవుట్

బోయపాటి - బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ షాక్‌కు గురి చేస్తోంది. ఈ సినిమాకు పని చేయబోతున్న సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్.. అర్థాంతరంగా తప్పుకున్నారనేదే ఆ వార్త సారాంశం. అయితే, దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. సీనియర్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్నో చిత్రాలకు పని చేశారు.

 తప్పించారా.? ఆయనే తప్పుకున్నారా.?

తప్పించారా.? ఆయనే తప్పుకున్నారా.?

రామ్ ప్రసాద్ గతంలో బాలయ్య నటించిన చాలా చిత్రాలకు పని చేశారు. ముఖ్యంగా ఆయన ఈ మధ్య నటించిన ‘లెజెండ్', ‘జై సింహా', ‘రూలర్'తో పాటు స్టార్ హీరోల మూవీలకు పని చేశారు. ఈ కారణంగానే బోయపాటి ఆయనను ఫైనల్ చేశారట. అయితే, ఉన్నట్లుండి ఆయన వెళ్లిపోవడంతో.. సినిమాటోగ్రాఫర్‌ను తప్పించారా.? ఆయనే స్వయంగా తప్పుకున్నారా.? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X