ఎన్టీఆర్ - హృతిక్ మధ్య ఫైట్ .. గూస్ బంప్సే , వార్ 2పై సినిమాటోగ్రాఫర్ పోస్ట్ వైరల్
ఈ ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ జోష్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దేవర పూర్తి చేయడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 పై చిత్ర సీమలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఎన్టీఆర్ మంచి ఊపులో ఉన్నారు. ఇప్పటికే గ్లోబల్ ఇమేజ్ సాధించిన తారక్ .. హిందీలోనూ బలంగా జెండా పాతాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో తారక్ క్యారెక్టర్, గెటప్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు.

అంతేకాదు.. వార్ 2లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందులోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్‌కి విలన్‌గా తారక్ నటించడం తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్‌లోనూ ఉత్కంఠ రేపుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా వచ్చే ఏడాది ఆగస్ట్ 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక వార్ 2లో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని.. ఓ స్టార్ హీరోయిన్ ఈ ఐటెం సాంగ్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. శ్రద్ధా కపూర్ లేదా శ్రీలీలల పేర్లు ఈ విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇకపోతే.. వార్ 2లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉండనున్నాయట. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఆస్ట్రేలియాకు చెందిన బెంజమిన్ జాస్పర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ అభిమానులను అలరిస్తోంది. 2024లో తాను పనిచేసిన చివరి చిత్రంలో నింగి, నేల, నీటిలో చిత్రీకరించబడిందని .. అలాగే ఇటలీ, స్పెయిన్, యూఏఈ, ఇండియాలలోని డెస్టినేషన్స్ పేర్లను కూడా జాస్పర్ పంచుకున్నారు. హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా వార్ 2 యాక్షన్ స్టంట్స్ ఉంటాయని ఆయన హింట్ ఇచ్చేశారు.

అనుకోని కారణాల వల్ల తప్పుడు మార్గం వైపు వెళ్లిన ఆఫీసర్‌గా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని , అతని పేరు అర్జున్ లూత్రాగా బాలీవుడ్ టాక్. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ జపాన్‌లోని షావోలిన్ టెంపుల్‌లో చిత్రీకరించగా.. అక్కడి ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 40 మందితో చేసిన ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని బీటౌన్ టాక్.
కియారా అద్వానీ - హృతిక్ రోషన్‌లపై ఇటలీలో ఓ పాటను చిత్రీకరించగా.. తొలుత సిద్ధార్ధ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయగా, ఆయన స్థానంలో అయాన్ ముఖర్జీకి అవకాశం ఇచ్చాడు ఆదిత్య చోప్రా. బ్రహ్మాస్త్ర విజువల్ ఎఫెక్ట్స్ చూసిన తర్వాత ముఖర్జీకి అవకాశం కల్పించినట్లుగా చెబుతారు.


Click it and Unblock the Notifications











