హీరో ప్రభాస్, ఎన్టీఆర్, దిల్ రాజుకు ఛాలెంజ్!
సినీ, రాజకీయ సెలబ్రిటీల మధ్య కొన్ని రోజులుగా గ్రీన్ ఛాలెంజ్ పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మోహన్ బాబు లాంటి ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
తాజాగా ఈ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరో ప్రభాస్, ఎన్టీఆర్‌లకు సవాల్ విసిరారు. వీరితో పాటు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఛాలెంజ్ చేశారు.

తెలంగాణ హరితహారం కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా కొన్ని రోజులుగా ఈ గ్రీన్ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఈ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్లు సైతం ఈ ఛాలెంజ్ స్వీకరించడం అభిమానుల్లో సైతం స్పూర్తి నింపింది. వారు కూడా మొక్కులు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











