కారు సృష్టించే కలకలం.. బిగ్‌బాస్ ఫేమ్ ఆషు రెడ్డి కీలక పాత్రలో సర్కస్ కార్-2
నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం సర్కస్ కార్-2. మంచి విజయం సాధించిన సర్కస్ కార్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూడా యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ రూపొందిస్తున్నారు.

బిగ్‌బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ... సర్కస్ కార్ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు.
దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే "సర్కస్ కార్-2" మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ "సర్కస్ కార్-2"కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు.
నటీనటులు: బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ తదితరులు
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్
నిర్మాత: శివరాజు వి.కె
ఆర్ట్: బీఎస్ జగన్నాధరావు
డి.ఐ: డాలి శేఖర్
మ్యూజిక్: చైతన్య
ఎడిటింగ్: గౌతమ్ కుమార్
కెమెరా: జీఎస్ చక్రవర్తి రెడ్డి (చక్రి)
పీఆర్వో: ధీరజ్-అప్పాజీ


Click it and Unblock the Notifications











