బోయపాటి సినిమాలో విలన్ పాత్రలో బాలయ్య.. నిజమెంత?

నందమూరి బాలక్రిష్ణ మళ్ళీ ఫామ్ లోకి రావాల్సిన సమయం వచ్చింది. వేగంగా సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన కలెక్షన్స్ అందుకోవడం లేదు. ఒకప్పుడు మినిమామ్ వసూళ్లతో బి సి సెంటర్లను షేక్ చేసిన నటసింహం ఇప్పుడు కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా రికవరీ చేయడం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య బాబుని ఉహించని దెబ్బ కొట్టింది.

ఆ సినిమా రిలీజ్ కి ముందు ఏ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రిలీజ్ తరువాత కథానాయకుడు, మహానాయకుడు ఒక దానికంటే మరొకటి దారుణంగా చతికిల పడ్డాయి. నష్టాలు తేవడమే కాకుండా నెగిటివ్ కామెంట్స్ ని కూడా అందించిన ఆ సినిమా రిజల్ట్ ని బాలయ్య ఇంకా మరచిపోలేకపోతున్నాడు. ఆ తరువాత చేసిన రూలర్ కూడా పెద్దగా ఆడింది లేదు. ఇక ఎలాగైనా మంచి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సత్తా చూపించాలని తన సెంటిమెంట్ దర్శకుడిని లైన్ లో పెట్టాడు.

Clarification of balakrishna villain role in boyapati srinu project

సింహా - లెజెండ్ సినిమాలతో బాలక్రిష్ణ కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీనివాస్ బాలక్రిష్ణ నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ తో పాటు బాలక్రిష్ణ విలన్ పాత్రలో కూడా అతి భయంకరంగా కనిపించనున్నట్లు టాక్ వచ్చింది.

అయితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం బాలయ్య విలన్ పాత్రలో కనిపించడం లేదట. కేవలం ఒక పాత్ర మాత్రమే అందులో కాస్త నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. కానీ ఆ పాత్ర సినిమాకె హైలెట్ గా నిలుస్తుందట. ఇంటర్వెల్ లో ట్విస్ట్ మాములుగా ఉండదని టాక్. పైగా బాలక్రిష్ణ మునుపెన్నడు చూడనివిధంగా పవర్ఫుల్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X