‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ: పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశారుగా

చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అయినప్పటికీ అతడికి ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. వరుస పెట్టి ఒక దాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తున్నప్పటికీ.. అతడిని విజయం వరించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసినా.. విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఇది ఓటీటీలో రిలీజ్ కాబోతుందని ప్రచారం మొదలైంది. దీంతో చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని రెండు మూడు రోజులుగా ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై స్పందిస్తూ.. ఓటీటీ వార్తలను ఖండించింది. ఈ సినిమాను ఎలాగైనా.. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని తేల్చేసింది. పరిస్థితులు చక్కబడే వరకూ వేచి చూస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Clarity about Akhil Akkinenis Most Eligible Bachelor Release

లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు భాస్కర్. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X