For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కారు వారి పాట’ నుంచి షాకింగ్ న్యూస్: ఈ సినిమాలో ఆ హీరో విలన్ కాదట

    |

    'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసిన పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మకంగా రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొట్టేస్తుంది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన చేసేది విలన్ పాత్ర అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అర్జున్ చేసేది విలన్ రోల్ కాదట. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు, అతడిని మహేశ్ బాబు విభేదిస్తుంటాడని.. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య మైండ్‌గేమ్ నడుస్తుంటుందని కూడా తెలిసింది. ఈ పాత్రను ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు పరశురాం.

    Clarity about Arjun Sarja Role in Mahesh Babus Sarkaru Vaari Paata

    ఇక, 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ జూలై 16 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం నగర శివారు ప్రాంతంలో ఓ ప్రత్యేకమైన సెట్‌ను కూడా నిర్మించారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదల కాబోతుంది.

    English summary
    Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Senior Hero Arjun Sarja to play Police Role In This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X