బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. ఎన్నికల ప్రచారం వెనుక రహస్యం ఇదేనట

By Manoj

బ్రహ్మానందం.. తెలుగు వాళ్లకు ఈ పేరుతో సుదీర్ఘ పరిచయం ఉంది. దాదాపు నలభై ఐదేళ్ల పాటు సినీ రంగంలో ఉన్న ఆయన వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. సినిమాలో హీరో ఎంట్రీకి ఎంత హైప్ ఉంటుందో.. బ్రహ్మానందం పరిచయ సన్నివేశానికి కూడా అదే తరహా క్రేజ్ ఉంటుంది. అంతలా ఆయన ప్రభావం సినిమాలపై ఉంది. అయితే, ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన హాస్యబ్రహ్మ.. కొద్ది రోజులుగా నెమ్మదించారు. ప్రస్తుతం సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు. దీంతో ఆయన సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఆయన చేసిన పని.. హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆశ్చర్యకర విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

హాట్ టాపిక్ అయిన హాస్యబ్రహ్మ

హాట్ టాపిక్ అయిన హాస్యబ్రహ్మ

ప్రస్తుతం ముఖ్యమైన సినిమాల్లో మాత్రమే నటిస్తున్న బ్రహ్మానందం.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో కనిపించి షాకిచ్చారు. శనివారం చిక్కబళ్లాపురలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆయన రోడ్‌ షో నిర్వహించారు. దీనికి భారీ స్థాయిలో జనాలు హాజరయ్యారు. దీంతో ఆయన ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అటు కర్నాటకలోనూ హాట్ టాపిక్ అయిపోయారు.

రాజకీయాల్లోకి బ్రహ్మానందం

రాజకీయాల్లోకి బ్రహ్మానందం

బ్రహ్మానందం ఓ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది.

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తల గురించి ఓ ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. ఆయన రాజకీయాల్లో రావడం లేదని తెలిసింది. చిక్కబళ్లాపుర బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌తో ఉన్న పరిచయం వల్లే ఆయన ప్రచారానికి వెళ్లారని కొందరు అంటున్నారు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
బ్రహ్మానందం వాటిలోనే కనిపిస్తారు

బ్రహ్మానందం వాటిలోనే కనిపిస్తారు

2019లో విడుదలైన సినిమాల్లో బ్రహ్మానందం కేవలం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు' అనే సినిమాలో మాత్రమే ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ‘మన్మథుడు 2', ‘గద్దలకొండ గణేష్' సినిమాల్లో కామియో రోల్స్ చేశారు. ఇక, వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదలయ్యే ‘సరిలేరు నీకెవ్వరు', ‘అల.. వైకుంఠపురములో' మాత్రమే ఆయన నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X