భారీ ధరకు ఓటీటీ సొంతమైన ‘టక్ జగదీష్’: నాని మూవీపై అనుమానాల్లేవట

తెలుగు సినీ ఇండస్ట్రీలో రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. 'జెర్సీ' తర్వాత భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న అతడు.. ప్రస్తుతం 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శివ నిర్వాణ రూపొందించిన ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడిపోయింది. దీంతో ఈ మూవీ రిలీజ్‌పై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.

'టక్ జగదీష్' మూవీ రిలీజ్ గురించి 'టక్ జగదీష్ విడుదల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము' అని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ ప్రకటించింది. ఆ తర్వాత దీని రిలీజ్ డేట్ గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారని, ఇందుకోసం ఏకంగా రూ. 45 కోట్లు చెల్లించారని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Clarity about Nanis Tuck Jagadish OTT Release

అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదట. ఎప్పటి వరకైనా వేచి చేసి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడు పోయాయి. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X