twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas Salaar Release Date: షూర్ షాట్.. నో డౌట్ అంటోన్న డైరెక్టర్

    |

    'కేజీఎఫ్' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి, దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'సలార్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కానీ, కరోనా ప్రభావం కారణంగా దీనికి బ్రేక్ పడిపోయింది. దీంతో ఈ సినిమా విడుదలపై ఆ ప్రభావం పడే అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల గురించి ఓ న్యూస్ తాజాగా బయటకొచ్చింది.

    షూటింగ్‌కు అంతరాయం ఏర్పడడంతో 'సలార్' మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. చిత్ర వర్గాలకు సంబంధించిన సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికే విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తవగా.. గుజరాత్‌తో మరో షెడ్యూల్ జరగనుందట.

    Clarity about Prabhas Salaar Release Date

    అలాగే, పాటల కోసం ఫారెన్ వెళ్లబోతున్నారట. వీటన్నింటికీ 50 నుంచి 60 రోజుల షూటింగ్ జరిపితే సరిపోతుందని ప్రశాంత్ నీల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. అంటే.. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 14, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

    పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి, కొడుకులా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్.

    English summary
    Young Rebel Star Prabhas Upcoming Movie is Salaar under Prashanth Neel Direction. Now Clarity about This Film Release Date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X