The Family Man 2 తెలుగు స్ట్రీమింగ్‌పై క్లారిటీ: వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతుందంటే!

కొంత కాలంగా భారతదేశంలో ఓటీటీ సంస్థల హవా కనిపిస్తోంది. డిజిటల్ ప్రపంచంలో సరిహద్దులు, పరిమితులు ఉండవు కాబట్టి.. చాలా మంది దర్శక నిర్మాతలు దీని వైపు చూస్తున్నారు. వీటికి ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో ఆకర్షితులు అవుతున్నారు. దీంతో వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో, స్టార్ హీరోయిన్లు, హీరోలు సైతం ఓటీటీల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తద్వారా సక్సెస్‌లను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కూడా ఓటీటీలో వెబ్ సిరీస్‌ను చేసింది.

మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. దీన్ని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్ ఈ ఏడాదిలోనే జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఈ వెబ్ సిరీస్ ద్వారానే డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇక, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సిరీస్‌కు దేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. మరో ముఖ్యమైన రోల్‌లో నటించిన అక్కినేని సమంత మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె చేసిన రాజీ అనే క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇందులో బోల్డుగా కనిపిస్తూనే ఎన్నో సాహసాలు చేసిన సమంతపై విమర్శలే ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఫలితంగా ఆమెకు అభిమానులు పెరిగారు. అదే సమయంలో కొన్ని వివాదాలు చెలరేగినప్పటికీ.. అవి వెంటనే చల్లారిపోయాయి.

 Clarity about Samanthas The Family Man 2 Telugu Streaming

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. దీనిపై దక్షిణాది ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. దీంతో త్వరలోనే తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేస్తామని దర్శకులు అప్పట్లో ప్రకటించారు. కానీ, దీనిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. దీంతో అసలు ప్రాంతీయ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో తాజాగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ తెలుగు, తమిళం స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ తెలుగు వెర్షన్‌ను ఆగస్టు చివరి వారం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇటీవలే అక్కినేని సమంత కూడా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. మిగిలిన వాళ్లకే ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ తెలుగు, తమిళ వెర్షన్‌ కోసం వేచి చూస్తోన్న దక్షిణాది అభిమానులకు ఇది గుడ్‌ న్యూసే అని చెప్పడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X