Pushpa OTT Release: పుష్ప స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ న్యూసే

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి స్టైల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. గత ఏడాది వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'పుష్ప' అనే సినిమాను చేశాడు.

రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ.. మొదటి పార్ట్ 'పుష్ప ద రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప'గా వచ్చిన అల్లు అర్జున్

‘పుష్ప'గా వచ్చిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'పుష్ప'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

అతడి కెరీర్‌లోనే భారీ స్థాయిలో

అతడి కెరీర్‌లోనే భారీ స్థాయిలో

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అదిరిపోయే టాక్‌తో అన్ని చోట్లా

అదిరిపోయే టాక్‌తో అన్ని చోట్లా

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'గా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే టాక్‌తో ప్రదర్శితం అవుతోంది.

కలెక్షన్ల వర్షం.. సెంచరీ చేసేసి

కలెక్షన్ల వర్షం.. సెంచరీ చేసేసి

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఆల్‌టైం రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇక, ఐదు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల రూపాయల షేర్‌ను కూడా అందుకుని సత్తా చాటేసింది.

పుష్ప ఓటీటీ అప్పుడేనని టాక్

పుష్ప ఓటీటీ అప్పుడేనని టాక్

ఐకాన్ స్టార్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, దీన్ని సంక్రాంతి కానుకగా ఓటీటీలో విడుదల చేస్తున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Pushpa The Rise Review.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే
పుష్ప ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ

పుష్ప ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ

'పుష్ప' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. దీన్ని సంక్రాంతికే స్ట్రీమింగ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్ట్రీమింగ్ సంక్రాంతి సీజన్‌లో ప్రారంభం కాదట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆరు వారాల తర్వాతే దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X