NBK108: లారీ డ్రైవర్‌గా బాలయ్య.. అసలు విషయం తెలిస్తే మెంటలెక్కిపోద్ది!

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం అలిసిపోకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' సక్సెస్ తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్న ఆయన.. ఈ ఏడాది 'వీర సింహా రెడ్డి'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు బాలయ్య తన 108వ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో చేస్తున్నారు. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రకటన తర్వాత చాలా ఆలస్యంగానే ప్రారంభం అయింది. దీనికితోడు మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. దీంతో ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఇప్పుడు శరవేగంగానే షూటింగ్ జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 70 శాతం షూట్ పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణను హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ స్టూడియోలో జరుపుతున్నారు. ఇందులో సెంటిమెంట్ సీన్స్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ లీకైంది.

 Clarity on Balakrishna Role in Anil Ravipudi Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య రోల్ గురించి చాలా రకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో ఆయన లారీ డ్రైవర్ పాత్రను చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బాలయ్య అలాంటి పాత్రను చేయడం లేదట. ఫస్టాఫ్ మొత్తం ఆయన జైలులో ఖైదీగా కనిపిస్తారని తెలిసింది. ఇక, ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ పేరున్న వ్యక్తిగా దర్శనమిస్తారట. ఈ రెండూ వేరే వేరు గెటప్‌లతో ఉంటాయని తెలిసింది. ఈ రెండు పాత్రల్లోనూ ఆయన తనదైన శైలి నటనతో మెప్పించబోతున్నారని అంటున్నారు.

 Clarity on Balakrishna Role in Anil Ravipudi Movie

నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని దసరాకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X