‘లవ్ స్టోరీ’ మూవీ రిలీజ్‌పై క్లారిటీ: ఆ రెండు డేట్లను పరిశీలిస్తున్న యూనిట్

అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టజర్, పోస్టర్లు ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక, ఇప్పుడు కొత్త డేట్‌పై క్లారిటీ వచ్చింది.

పూర్తి స్థాయి ప్రేమకథతో రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇక, జూలై 1 నుంచి యాభై శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు రన్ అవనున్న నేపథ్యంలో ఈ మూవీని ఆగస్టు 13న కానీ, 27న కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండింట్లో ఒక దానిని త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Clarity on Love Story New Release Date

'లవ్ స్టోరీ' మూవీలో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అతడి దగ్గర డ్యాన్స్ నేర్చుకోడానికి వచ్చిన సాయి పల్లవి ప్రేమలో పడుతుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో విషాదకర ముగింపు ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X