మహేష్ 26 టైటిల్ విషయంలో క్లారిటీ.. సాఫ్ట్‌గా ఉన్న మహర్షి తర్వాత

Recommended Video

#Mahesh26 | Interesting Updates On Mahesh Babu New Movie | Mahesh Babu | Anil Ravipudi | Filmibeat

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్ర విజయం మహేష్ బాబులో నూతన తేజాన్ని తీసుకొచ్చింది. ఈ విజయం ఇచ్చిన జోష్‌లో వెంటనే మహర్షి సినిమా చేశాడు మహేష్. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. దీంతో కాలర్ ఎగరేసిన మహేష్ బాబు ఈ సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించిన అనేక విషయాలు మహేష్ అభిమాన వర్గాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దామా..

మహేష్‌తో రష్మిక రొమాన్స్

మహేష్‌తో రష్మిక రొమాన్స్

టాలీవుడ్ లో అనతి కాలంలోనే యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసింది రష్మిక మందన్న. వరుస హిట్స్‌తో ప్రేక్షక లోకానికి కొత్త టేస్ట్ చూపించిన ఈ కన్నడ భామ మహేష్ 26 లో ఆయనతో కలిసి చిందులేయనుండటం చూడాలని ఆతృతగా ఉంది మహేష్ బాబు అభిమానుల్లో.

విజయశాంతి పర్‌ఫార్‌మెన్స్

విజయశాంతి పర్‌ఫార్‌మెన్స్

గతంలో దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమను ఏలిన లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి మహేష్ 26 తో రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వండితెరపై విజయశాంతి పర్‌ఫార్‌మెన్స్ చూసేందుకు కుతూహలంగా ఉన్నారు జనం.

టైటిల్ విషయంలో..

టైటిల్ విషయంలో..

భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ విజయాల తర్వాత మహేష్ హాట్రిక్ మూవీగా ఈ సినిమా రానుంది. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి బలమైన కథ సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అనిల్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నారని తెలిసింది.

మహర్షి లాంటి సాఫ్ట్ టైటిల్ తర్వాత

మహర్షి లాంటి సాఫ్ట్ టైటిల్ తర్వాత

మహేష్ కెరీర్‌లో వచ్చిన సినిమాలు ఎక్కువగా సాఫ్ట్ టైటిల్స్‌తోనే వచ్చాయి. అయితే మహేష్ 26 మాత్రం అందుకు భిన్నంగా స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే టైటిల్‌తో రాబోతోందని టాక్ వినిపించింది. 'వాట్సాప్' అనే మరో డిఫెరెంట్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది.

చివరకు క్యాచీ టైటిల్

చివరకు క్యాచీ టైటిల్


అయితే స‌రిలేరు నీకెవ్వ‌రూ, వాట్సాప్ లాంటి టైటిల్స్ ఈ కథకు సూట్ కావని భావించిన అనిల్ రావిపూడి చివరకు 'రెడ్డిగారి అబ్బాయి' అనే టైటిల్ ఫైనల్ చేశారని ఫిలింనగర్ టాక్. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుండ‌టంతో ఈ టైటిల్ అయితేనే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అనిల్ డిసైడ్ అయ్యారట. దీంతో మహేష్ టైటిల్ విషయమై జోరుగా చర్చలు సాగుతున్నాయి ఫిలింనగర్ వర్గాల్లో.

మహర్షి స్పీడ్

మహర్షి స్పీడ్

ఇప్పటికే విజయవంతంగా మొదటివారం పూర్తిచేసుకొని రెండో వారంలో అడుగుపెట్టిన మహర్షి సినిమా ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను తిరగరాస్తోంది. చిత్రంలో చూపించిన సామాజిక అంశాల పట్ల సినీ, రాజకీయ వర్గాలు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇక మహేష్, పూజాహెగ్డే కెమిస్ట్రీ, అల్లరి నరేష్ నటన మహర్షి చిత్రానికి భారీ విజయం తెచ్చిపెట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X