‘టక్ జగదీష్’ మూవీ రిలీజ్‌పై క్లారిటీ: ఆ రెండు డేట్లలో ఒకటి ఖాయమట
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ప్రస్తుతం 'నిన్ను కోరి' దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేశాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయినప్పటికీ.. కోవిడ్ రెండో దశ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఇది ఎప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్‌పై తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టక్ జగదీష్' సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది.

కానీ, ఆ తర్వాత ఆ వార్తలను చిత్ర యూనిట్ కొట్టేసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. జూలై 1 నుంచి యాభై శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు రన్ అవనున్న నేపథ్యంలో ఈ మూవీని ఆగస్టు 13న కానీ, 27న కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండింట్లో ఒక దానిని త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక, ఇందులో నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











