పవన్ సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్: అసలేం జరిగింది? అందులో నిజమెంత?

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. జెట్ స్పీడుతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరో.. ఇది షూటింగ్ జరుపుకుంటోన్న సమయంలోనే మరో మూడు ప్రాజెక్టులను ఫైనల్ చేసుకున్నాడు. ఇప్పుడు వాటికి సంబంధించిన షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అన్నింటినీ ప్రకటించినా.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వాటిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. పవన్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తీస్తోన్న 'హరిహర వీరమల్లు' ఒకటి.

పవన్ కల్యాణ్ హీరోగా పిరియాడిక్ జోనర్‌లో మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ చాలా వరకు పూర్తైంది. వాస్తవానికి ఇది ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల తరచూ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో త్వరలోనే దీన్ని పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దీని కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను కూడా నిర్మించారు. ఇక, వచ్చే నెల నుంచి పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒకసారి ఈ షూటింగ్ మొదలైతే సినిమా పూర్తయ్యే వరకూ ఆపకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది

Clarity on Nidhhi Agerwal Exit From Harihara Veeramallu

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. అయితే, ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేసేసింది. ఇలాంటి తరుణంలో కొద్ది రోజుల క్రితమే 'హరిహర వీరమల్లు' సినిమాలోని నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అలాగే ఇందులో ఆమె చేసే పాత్ర పేరును కూడా రివీల్ చేశారు.

'హరిహర వీరమల్లు' షూటింగ్ రోజురోజుకూ ఆలస్యం అవుతుండడంతో దీని నుంచి నిధి అగర్వాల్ తప్పుకుందని ఇటీవలే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొట్టింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తప్పుకోలేదట. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ కూడా పూర్తైందని పేర్కొన్నాయి. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది.

'హరిహర వీరమల్లు' మూవీలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడు. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X