‘తిమ్మరుసు’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ: ఏ సంస్థ దక్కించుకుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ఈ మధ్య కాలంలో మంచి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ టాలెంటెడ్ హీరో 'తిమ్మరుసు' అనే సినిమాలో నటించాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌పై క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘తిమ్మరసు'గా వచ్చిన విలక్షణ హీరో

‘తిమ్మరసు'గా వచ్చిన విలక్షణ హీరో

సహజ సిద్ధమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అతడు నటించిన చిత్రమే 'తిమ్మరుసు'. ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బీర్బల్'‌ అనే మూవీకిది రీమేక్‌గా వచ్చింది.

అన్ని చోట్లా పాజిటివ్ టాక్... హిట్టే

అన్ని చోట్లా పాజిటివ్ టాక్... హిట్టే

జూలై 30 'తిమ్మరుసు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇక, ఈ మూవీకి అన్ని లొకేషన్స్ నుంచి పాజిటివ్ టాక్ దక్కింది. మరీ ముఖ్యంగా ఇందులో సత్యదేవ్ నటన, ట్విస్టులు, యాక్షన్ పార్ట్, బ్యాగ్రౌండ్ స్కోర్, బ్రహ్మాజీ కామెడీ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

అనుమానాలు పటాపంచలు చేస్తూ

అనుమానాలు పటాపంచలు చేస్తూ

కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఇంత కాలం థియేటర్లు మూత పడిపోయాయి. సుదీర్ఘ విరామం తర్వాత జూలై 30న సినిమా హాళ్లన్నీ తెరచుకున్నాయి. అది కూడా సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' మూవీతోనే. క్లిష్ట సమయంలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందించారు. ఫలితంగా భారీ స్థాయిలో కాకపోయినా.. ఓ మోస్తరుగా కలెక్షన్లను రాబడుతోందీ సినిమా.

 అక్కడ మాత్రం ఇబ్బందులున్నాయి

అక్కడ మాత్రం ఇబ్బందులున్నాయి

'తిమ్మరుసు' మూవీ నైజాంలో దాదాపు 300 థియేటర్లలో విడుదలైంది. అలాగే, యూఎస్‌లో సైతం దాదాపు 30 లొకేషన్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇది కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది.

‘తిమ్మరుసు' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ

‘తిమ్మరుసు' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ

సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' మూవీకి మంచి టాక్ రావడంతో పాటు ఈ సినిమాను ప్రేక్షకులు కొనియాడుతున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కానీ, ఏపీలోకి చాలా ప్రాంతాల సినీ ప్రియులకు ఈ సినిమా చేరువ కాలేదు. దీంతో వాళ్లంతా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'తిమ్మరుసు' ఓటీటీ రిలీజ్‌పై ఓ న్యూస్ లీకైంది.

ఆ సంస్థకే.. ఎప్పుడు రాబోతుంది?

ఆ సంస్థకే.. ఎప్పుడు రాబోతుంది?

తాజా సమాచారం ప్రకారం.. 'తిమ్మరుసు' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట. అది కూడా భారీ మొత్తం వెచ్చించి ఈ రైట్స్‌ను సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక, స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. విడుదలైన ముప్పై రోజుల తర్వాతనే ఇది ఓటీటీలో రిలీజ్ కాబోతుందని తెలిసింది. అంటే ఆగస్టు చివర్లో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X