చిరంజీవితో సెట్లో నగ్మా గొడవ.. షూటింగ్‌ నుంచి వాకౌట్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక గొడవజరుగుతూనే ఉంటుంది . 24 క్రాఫ్ట్స్ లో అందరూ సాటిస్పై అవ్వాలని లేదు. కొన్నిసార్లు డైరెక్టర్, హీరో, హీరోయిన్, మిగతా టెక్నీషయన్స్ మధ్య విబేధాలు వస్తూ ఉంటాయి. దాని వలన సెట్ లో కోప్పడడం, అలగడం జరుగుతూ ఉంటాయి. అలా ఒక సినిమా షూటింగ్ లో ఒక స్టార్ హీరోయిన్ కు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఒక చిన్న వివాదం జరిగిందంట. దాని వలన ఆ హీరోయిన్ అలిగి సెట్ నుంచి వెళ్ళిపోబోతుంటే.. మెగాస్టార్ అయ్యి ఉండి కూడా ఆమె వెనుకాల పరిగెత్తి మరీ చిరు బతిమిలాడాడట. మరి అంతలా మెగాస్టార్ తో బతిమాలాడించుకున్న హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం

ఇప్పుడంటే స్టార్ హీరోయిన్లు గ్లామర్ ఒలకబోయడం కామన్ అయిపోయింది. కానీ, అప్పట్లోనే అందాల హీరోయిన్ నగ్మా ఇంతకంటే ఎక్కువ గ్లామర్ ను ఒలకబోసి ఔరా అనిపించింది. అందం, అభినయం, డ్యాన్స్, అందాల ఆరబోత.. ఏదైనా సరే అమ్మడు రంగంలోకి దిగనంత వరకే. ఒక్కసారి నగ్మా రంగంలోకి దిగిందా.. పక్కన చిరంజీవి ఉన్నా.. బాలకృష్ణ ఉన్నా.. నాగార్జున ఉన్నా.. అందరి చూపు మాత్రం ఈ ముద్దుగుమ్మ మీదనే ఉండాలి. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన క్యారెక్టర్స్ లో నటించాలి అంటే నగ్మా తరువాతే ఎవరైనా అని చెప్పాలి.

Clash between heroine Nagma and Chiranjeevi on the sets of Rikshavodu

ఇక చిరంజీవి- నగ్మా కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు.. ఇలా వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి. అరేబియన్ గుర్రం లాంటి నగ్మాతో డ్యాన్స్ వేయగల ఏకైక హీరో అంటే చిరంజీవి మాత్రమే అని అప్పట్లో అభిమానులు మాట్లాడుకొనేవారట. ఇక అలాంటి వీరిద్దరి మధ్య ఒక సినిమా సెట్ లో గొడవ అయ్యిందట. ఆ సినిమానే రిక్షావోడు.

రిక్షావోడు సినిమా సమయంలో నగ్మా, చిరంజీవికి చుక్కలు చూపించిందంట. 1995 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో చిరు సరసన నగ్మా మెయిన్ హీరోయిన్ గా నటించగా.. సౌందర్య సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నగ్మా .. ఒక పెద్ద రాజకీయ నాయకుడు కూతురు. తలనిండా పొగరుతో ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో ఆమె లీనమైపోయి చిరుతో గొడవ పెట్టుకుందంట. రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి మధ్య ఒక పాట షూట్ జరుగుతున్న సమయంలో.. చిరుకు, నగ్మాకు గొడవ జరిగిందంట.

Clash between heroine Nagma and Chiranjeevi on the sets of Rikshavodu

సాంగ్ షూట్ లోనే చిరుతో గొడవపడిన ఆమె సెట్ నుంచి వెళ్లిపోయిందంట. ఇక నగ్మా
షూటింగ్ నుంచి వెళ్లిపోతుంటే..యూనిట్, డైరెక్టర్‌కు ముచ్చెమటలు పట్టాయి. కానీ చిరంజీవి వెళ్లి ఏం చెప్పాడో.. ఏం మ్యాజిక్ చేశాడో కానీ.. నగ్మా నవ్వుకుంటూ షూటింగ్‌కు తిరిగి వచ్చిందంట. చిరంజీవి ఎలా నచ్చజెప్పి తీసుకొచ్చాడా? అని అందరూ పరేషాన్ అయ్యారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అంత స్టార్ అయ్యి ఉండి కూడా .. ఇలా చిన్నదానికి అలిగిన హీరోయిన్ తో అలా నవ్వుతు బతిమాలాడడం గ్రేట్ అని చిరును అభిమానులు పొగిడేస్తున్నారు.

ఇకపోతే నగ్మా.. ప్రస్తుతం సినిమాలు మానేసి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన నగ్మా రీఎంట్రీ లాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవడం లేదని టాక్. ఇక చిరంజీవి విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 60 ఏళ్లు దాటినా ఇంకా కుర్ర హీరోలకు పోటీగా డ్యాన్స్ లతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో విశ్వంభర సినిమా ఉంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Read more about: rikshavodu chiranjeevi nagma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X