మొత్తానికి త్రివిక్రమ్, రాజమౌళి ఆ చెడ్డ పేరును చెరిపేసుకున్నారు..!
సినిమా ఇండస్ట్రీలో అలకలు, కోపాలు చాలా కామన్. బయటకు తెలియకపోయినా తెరవెనుక ఎన్నో జరుగుతుంటాయి. చేసిన సినిమా హిట్టవ్వాలనే తపన అందరికి ఒకేలా ఉంటుంది. ఇకపోతే హీరోల మధ్య వైరుధ్యాల గురించి అప్పట్లో వార్తలు బాగానే వచ్చేవి. కానీ ఈ కాలంలో సోషల్ మీడియా ప్రభావం వలన ఏ విషయమైనా జనాలకు ఇట్టే చేరిపోతోంది కాబట్టి హీరోలు కూడా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు.

ఇప్పుడు అలా లేదు..
ఒక సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ మధ్య చిన్న చిన్న వివాదాలు రావడం కామన్. సినిమా హిట్టయితే అన్ని మర్చిపోతారు. ఇక మరొకరు చేసిన సినిమా హిట్టయితే ఇండస్ట్రీలో కోపాలు, ఈర్షలు ఒకప్పుడు హై డోస్ లో ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. సినీ తారల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బాగానే పెరుగుతున్నాయి.

రాజమౌళి - త్రివిక్రమ్ ఎలా ఉంటారు?
ఒకరు విజువల్ వండర్ అయితే మరొకరు మాటల మాంత్రికుడు అని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరి మేకింగ్ డిఫరెంట్ అయినప్పటికీ డైరెక్షన్ లో ఇద్దరికి సమాన బలమే ఉంటుంది. ఇలాంటి స్టార్ దర్శకులు కలుసుకున్నపుడు ఎలా ఉంటారు అనేది అందరికి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బయట కొన్నిసార్లు మాత్రమే వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు.

అప్పట్లో ఒక రూమర్?
వీరిద్దరు బయట పెద్దగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకున్నది లేదు. మళ్ళీ మిగతా దర్శకులతో ఇద్దరు బాగానే టచ్ లో ఉంటారన్నది అందరికి తెలిసిన విషయమే. రాజమౌళి సుకుమార్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. కానీ త్రివిక్రమ్ తో మాత్రం జక్కన్న పెద్దగా మాట్లాడడు అని ఒక టాక్ వచ్చేది. ఇక ఇద్దరు దర్శకులు కూడా ఒక సినిమా చేస్తే అందులో హీరో మరొక దర్శకుడితో వర్క్ చేసేవారు కాదనే రూమర్ ఎక్కువగా వినిపించేది.
Recommended Video

ఆ చెడ్డపేరు చెరిపేసుకున్నారు..
జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. రాజమౌళితో వర్క్ చేస్తే.. త్రివిక్రమ్ మళ్ళీ ఆ హీరోలతో వర్క్ చేయడు అనే టాక్ నడిచేది. అలాగే రాజమౌళి కూడా త్రివిక్రమ్ వర్క్ చేసిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో వర్క్ చేయడు అనే టాక్ వచ్చేది. అయితే ఫైనల్ గా త్రివిక్రమ్ అరవింద సమేత చేయడం.. ఇప్పుడు రాజమౌళి కూడా మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధమవ్వడంతో వారిద్దరి మధ్య ఎలాంటి అసూయ ద్వేషాలు లేవని ఒక క్లారిటీ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











