Death Note Web Series: నువ్వొచ్చేసరికి స్వర్గంలో ఉంటా.. వెబ్‌‌సిరీస్ చూసి సింగర్ కుమారుడు ఆత్మహత్య

కొన్నేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టి ఎంతో మంది ప్రాణాలను తీసింది బ్లూవేల్ గేమ్. తల్లిదండ్రులను, పిల్లలనే కాకుండా ఏకంగా ప్రపంచ దేశాలను సైతం గడగడలాడించింది బ్లూవేల్. 50 రోజుల పాటు సాగే ఈ భయానక గేమ్‌లో రిజిస్టర్ చేసుకున్నవాళ్లు ఆ ఉచ్చులో బలవ్వాల్సిందే. గేమ్‌లో భాగంగా చేసే టాస్క్‌లకు వీడియోతో సహా ఆధారాలు ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రోజులు గడిచేకొద్ది ఈ గేమ్ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.

ప్రాణాలు తీసిన బ్లూవేల్
శరీరం మీద గాయాలు చేసుకోమని గేమ్‌లో రకరకాల టాస్క్‌లు వస్తాయి. చివరికి 50వ రోజు వచ్చేసరికి చనిపోవాలని అది మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మెంటల్‌గా అది ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ఫాలో అవుతున్న వారు చనిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. 2013లో రష్యాలో మొదలైన ఈ ప్రాణాంతక గేమ్ దెబ్బకు వందల మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించినా ఆన్‌లైన్‌లో దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బ్లూవేల్ బాటలోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌ పిల్లలు, యువత ప్రాణాలను తీసేస్తోంది.

Class 7 student from Bengaluru Dies By Suicide Police official Suspect Link To Death Note Web Series

వైరల్ అవుతోన్న డెత్ నోట్ వెబ్ సిరీస్
అదే జపనీస్ బాషలో విడుదలైన డెత్ నోట్ వెబ్ సిరీస్. సుగుమి ఓబా రాసిన నవల ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను టెట్సురో ఆరాకి తెరకెక్కించారు. మొత్తం 37 ఎపిసోడ్ల పాటు జపాన్‌లోని నిప్పాన్ టీవీలో ప్రతి బుధవారం టెలికాస్ట్ అయ్యింది. డిసెంబర్ 20, 2006 నుంచి జనవరి 3, 2007 వరకు ఈ వెబ్ సిరీస్ ప్రసారమైంది. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇందులోని థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలు యువతకు ముఖ్యంగా చిన్నారులకు బాగా నచ్చేశాయి.

ఆ మాయాబుక్‌లో పేరు రాస్తే చావడమే
చెడ్డవారు భూమిపై ఉండకూడదు, వారినీ అంతం చేయాలనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఇందులో ఓ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటూ ఉంటాడు. దీని ప్రకారం ఓ మాయా బుక్‌లో ఎవరి పేరు రాసి వారు ఎలా చనిపోవాలని అనుకుంటే ఆ వ్యక్తి అలాగే చనిపోతాడు. అయితే ఈ డెత్‌నోట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఓ వ్యసనంలో మార్చుకున్న కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Take a Poll

అమ్మా! స్వర్గానికి వెళ్తున్నా
కర్ణాటకకు చెందిన జీ గంగాధర్, సవితలు సంగీత కళాకారులు.. వీరి కుమారుడు గాంధార్‌ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ పిల్లాడు తెల్లవారుజామున గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో గాంధార్ రాసిన సూసైడ్ నోట్ రాశాడు. నన్ను ఎంతో బాగా పెంచారు.. చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చూసేలోగా నేను స్వర్గంలో ఉంటానని రాసుకొచ్చాడు. ఆ లేఖలో కొన్ని విచిత్రమైన బొమ్మలను కూడా గీయడంతో పోలీసులకు ఏం అర్ధం కాలేదు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గాంధార్‌కు డెత్ నోట్ వెబ్ సిరీస్‌ చూసే అలవాటు ఉండటంతో దీని ప్రభావానికి లోనైన గాంధార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: tollywood latest news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X