‘శ్రీకారం’ సినిమాలో హైలైట్లు అదేనట: గతంలో ఎన్నడూ చూడని విధంగా శర్వానంద్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి ప్రవేశించాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. ఆ తర్వాత హీరోగా మారిన అతడు.. ఎన్నో చిత్రాల్లో అసాధారణమైన నటనతో ఆకట్టుకున్నాడు. తద్వారా కొన్ని విజయాలను సైతం అందుకున్నాడు. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. అందుకే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాను చేశాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'శ్రీకారం' మూవీలో క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు, ఆ సమయంలో హీరో శర్వానంద్ పెర్ఫార్మెన్స్ అదరగొడుతుందని టాక్. వ్యవసాయం గురించి ఇచ్చే మెసేజ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఊహించని మలుపుతో ఉంటుందని తెలిసింది. అలాగే, ప్రీ క్లైమాక్స్‌లో కూడా ఓ ట్విస్ట్ ఉంచారనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉంటాయని, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయని తెలుస్తోంది.

 Climax Highlight in Sharwanands Sreekaram Movie

శర్వానంద్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X