Kushi మూవీ క్లైమాక్స్ లీక్: ఆ సీన్‌లో సమంత, విజయ్ అరాచకంగా!

హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని.. ఈ మధ్య కాలంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ 'ఖుషి' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎన్నో అవాంతరాల నడుమ ఇటీవలే కంప్లీట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతోంది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ చేసింది.

Climax Scene Between Vijay Deverakonda and Samantha Highlight in Kushi

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'ఖుషి' మూవీ నుంచి వచ్చిన మొత్తం అప్‌డేట్లకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులోని పాటలు అయితే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు.

'ఖుషి' మూవీ హీరో, హీరోయిన్లు ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. అనంతరం వాళ్ల మధ్య మనస్పర్థలు రావడం అనే అంశాలతో రూపొందిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత, విజయ్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ పాయింట్ లీక్ అయింది.

Climax Scene Between Vijay Deverakonda and Samantha Highlight in Kushi

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. 'ఖుషి' మూవీలో క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా ఉండబోతుందట. ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు మధ్య వచ్చే ఘర్షణపూరిత సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీరు తెప్పించే విధంగా డిజైన్ చేశారని తెలిసింది. ఇలా సరదాగా మొదలైన ఈ చిత్రం ఎమోషనల్ ఎండింగ్ ముగుస్తుందట. ఇది చూసిన వాళ్లంతా బరువైన గుండెతో బయటకు వస్తారనే టాక్ వినిపిస్తోంది.

ప్రేమ కథతో రూపొందుతోన్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X