నాని ‘టక్ జగదీష్’లో ఆ సీనే హైలైట్: దాదాపు పది నిమిషాలు అదరగొడతాడట

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించడంతో పాటు తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటిన అతడు.. ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. దీంతో ఒక దాని తర్వాత ఒకటి అలా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'టక్ జగదీష్' అనే సినిమాను చేస్తున్నాడు.

డీసెంట్ స్టోరీతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల అవగా.. వాటి అన్నింటికీ విపరీతమైన స్పందన వచ్చింది.

Climax Scene Highlight in Nanis Tuck Jagadish

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. 'టక్ జగదీష్'లో చివరి పది నిమిషాల క్లైమాక్స్ సీన్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందట. కీలక నటుల మధ్య సాగే ఈ సన్నివేశంలో నాని తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. కొన్ని ట్విస్టులతో సాగే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X