Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. సలార్ క్లైమాక్స్ భూమిపైన కాదట

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో పాన్ ఇండియా రేంజ్ స్టార్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. సాదాసీదాగా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. తెలుగులో స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి' చిత్రం అందించిన విజయంతో తన పంథాను మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. సినిమాల ఫలితాలను బేరీజు వేసుకోకుండా మూవీలు చేస్తూనే ఉన్నాడు. అలా తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ఎన్నో హైలైట్లు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో క్లైమాక్స్ సీక్వెన్స్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, దీన్ని భూమి మీద కాకుండా సముద్రంపై డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో బోట్ ఛేజింగ్ సీన్స్ మరింత హైలైట్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. ఇందుకోసం విదేశాలకు చెందిన టెక్నీషియన్లను తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను మరికొద్ది రోజుల్లోనే మొదలు పెడతారని తెలిసింది.

Climax Sequence Major Highlight in Salaar

రాకింగ్ స్టార్ యశ్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ స్థాయి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టేసింది. ఈ మూవీ హడావిడి అయిపోవడంతో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' పైనే ఫోకస్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ కోసం యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చిత్ర యూనిట్ ఇటీవలే వదిలింది. ఈ మూవీలో ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్‌ను కూడా హై లెవెల్‌లో డిజైన్ చేసినట్లు ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X