మహానాయకుడుని చంద్రబాబుకు ముందే చూపిస్తారట!
ఎన్నో అంచనాల నడుమ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. కానీ బాలయ్య శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాలేదు. ఈ చిత్రంలో అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగించే అంశాలు లేకపోవడంతో కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ప్రస్తుతం దర్శకుడు క్రిష్, బాలయ్య ఇద్దరూ ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడుకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ మహాయకుడు రఫ్ ఎడిట్ ని ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చూపిస్తారట. రెండవ భాగంలో చంద్రబాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో రానా పాత్ర అలా మెరిసి ఇలా వెళ్ళిపోతుంది. కానీ మహానాయకుడులో రానా పాత్ర సినిమామొత్తం ఉంటుంది. ఎన్టీఆర్ తో కలసి చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఎలా సాగింది తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించనున్నారు. అందుకే ముందుగా ఈ చిత్రాన్ని చంద్రబాబుకు చూపిస్తారట.


Click it and Unblock the Notifications











