twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయాన్ని ఇంటిపేరుగా మలుచుకొన్నాడు: విజయబాపినీడు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

    |

    తెలుగు చలన చిత్రసీమలో కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేసిన, మెగాస్టార్ చిరంజీవికి పలు బ్లాక్‌బస్టర్లు అందించిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహిస్తారు.

    అమెరికాలో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణంగా అంతక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయబాపినీడు పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ బాపినీడు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓ సంతాప ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    CM K Chandrasekhar Rao condolences on Vijayabapineedu death

    ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    English summary
    Gutta Bapineedu Chowdary also known as Vijaya Bapineedu, is no more. He was a magazine editor turned Indian film screenwriter and director, known for his works predominantly in Telugu Cinema.He has directed several block buster action films such as Maga Maharaju, Khaidi No.786, Gang Leader, and Magadheerudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X